Tuesday, February 28, 2023
Monday, February 27, 2023
Sunday, February 26, 2023
ఉగ్రవీరం లక్ష్మీవల్లభం
NAMASTHE TELANGANA- 27feb 2023
Saturday, February 25, 2023
Friday, February 24, 2023
Thursday, February 23, 2023
Wednesday, February 22, 2023
Tuesday, February 21, 2023
Monday, February 20, 2023
ఊపిరి బిగపట్టిన ఉద్యమ సన్నివేశం వి.ప్రకాశ్ (వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకులు)
ఊపిరి బిగపట్టిన ఉద్యమ సన్నివేశం
వి.ప్రకాశ్ (వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకులు)
ఈ గందరగోళాన్ని సభ గ్యాలరీనుంచి గమనిస్తున్న కేసీఆర్కు,ఇతర ఎంపీలకు ఒక దశలో తలలో నరాలు చిట్లింత టెన్షన్ కలిగింది.
ఒకదశలో తాను కన్నీళ్ళు పెట్టుకున్నట్లు కేసీఆర్ ఆ తర్వాత తెలిపారు. రాజ్యసభలో ఏ సవరణా ఆమోదం పొందలేదు. మూజువాణి ఓటుతో 'ది బిల్ ఈజ్ పాస్ట్' అని కురియన్ ప్రకటించారు.
తెలంగాణ ప్రజల చిరకాలవాంఛ నెరవేరింది. అందరి కండ్లల్లో ఆనంద బాష్పాలు!
2014 ఫిబ్రవరి 20- తెలంగాణ చరిత్రలో మరుపురాని రోజు. అప్పటికే లోక్సభ ఈ బిల్లును ఆమోదించిన సందర్భంలో ఆంధ్ర సభ్యులు నానా గందరగోళం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ బిల్లు రాజ్యసభ ఆమోదానికి వచ్చినపుడు తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. దేశ విదేశాల్లోని తెలంగాణ బిడ్డలు ఆందోళనతో ఊపిరి బిగపట్టి చూస్తున్న సందర్భమది. ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆందోళన చెప్పనలవికాదు. తన ప్రయత్నాలను తీవ్రంగా సాగించారు. ఉద్వేగభరిత సన్నివేశంలో తెలంగాణ బిల్లును ఫిబ్రవరి 20న రాజ్యసభ కూడా ఆమోదించింది. పార్లమెంట్ ఆమోదం పొందడంతో తెలంగాణ ప్రజల సంబురాలు అంబరాన్నంటాయి.
ఆనాడు తెలంగాణను ఆంధ్రతో విలీనం చేయడానికి ముందు పార్లమెంట్ భవన సమీపంలోని హైదరాబాద్ హౌజ్లోనే 1956 ఫిబ్రవరిలో సరిగ్గా 20వ తేదీనే 'జెంటిల్మెన్ అగ్రిమెంట్' పై సంతకాలు జరిగాయి. 57 ఏండ్ల తర్వాత 2014లో ఫిబ్రవరి 20న ఆంధ్ర నుంచి తెలంగాణ వేరు పడాలనే నిర్ణయం జరిగింది. ముడిపడ్డ రోజే వేరు పడటం యాదృచ్ఛికమే.
తెలంగాణ ప్రజల చిరకాల వాంఛఅయిన సొంత రాష్ట్ర ఏర్పాటును పార్లమెంటు ఆమోదించడం చరిత్రలో మరుపురాని రోజు. హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే లోకసభలో ఫిబ్రవరి 13న తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారు. అంతలోనే టీడీపీ సభ్యుడు ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి లోకసభ కార్యదర్శి టేబుల్ పై మైకు విరగ్గొట్టాడు. తెలంగాణకాంగ్రెస్ ఎంపీలు సోనియాకు, ప్రధానికి, స్పీకర్కు
రక్షణ వలయంగా నిలబడ్డారు. కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ముందుగా టేబుల్ పై గ్లాసు పగులగొట్టి, పెప్పర్ స్ప్రేను స్పీకర్ పై, సభ్యులపై చిమ్మారు. స్పీకర్తో సహపలువురు ఎంపీలు అస్వస్థతకు గురయ్యారు.
సభను వాయిదా వేసిన స్పీకర్ ఈ ఘటన పై తీవ్రంగా స్పందించారు. 'షేమ్ ఆన్ పార్లమెంటరీ డెమోక్రసీ' అని మీడియా ముందు వ్యాఖ్యానించారు. కొద్ది సేపటికే సభను తిరిగి ప్రారంభించి 16 మంది సీమాంధ్ర ఎంపీలతో పాటు తెలంగాణ ఎంపీలైన పొన్నం, గుత్తానుఫిబ్రవరి 20 దాకా స్పీకర్ సస్పెండ్ చేశారు. 'పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజు' అని జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. విభజన తప్పదని తెలిసి తమ ప్రాంతానికేం కావాలో అడగకుండా 'ఏం చేసైనా విభజనను ఆపుతామని' ఆంధ్ర నేతలు భావించడం వారి మూర్ఖత్వానికి నిదర్శనం.
సభను ప్రారంభించడానికి కొద్ది నిముషాలకు ముందు స్పీకర్ మీరాకుమార్ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ను తన ఛాంబర్కు పిలిచి మాట్లాడారు. స్పీకర్ అడిగిన ప్రశ్నలకు సుష్మా స్వరాజ్ సంతృప్తికరమైన సమాధానాలిచ్చారు. బీజేపీ అగ్రనేత అద్వాని తన పార్లమెంటరీ కార్యాలయం లోనే ఉండి పరిణామాలను గమనిస్తున్నారే తప్ప సభలోనికి రావడంలేదు. అయినా తెలంగాణ బిల్లుకు మద్దతిస్తామని తెలిపారు. మరోపక్క కేసీఆర్ సభలో పరిణామాలను గమనిస్తూ తెలంగాణ ఎంపీలకు, టీఆర్ఎస్లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నేతలకుసూచనలనిస్తూ వచ్చారు. వీరంతా అప్పటికే స్పీకర్ మీరాకుమార్ను బిల్లు పెట్టాలని ప్రార్ధించారు. సభ ఆర్డర్ లో లేనప్పుడు బిల్లు పెట్టడం సాధ్యంకాదని పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి కమలనాథ్, ప్రతిపక్షనేత సుష్మా స్వరాజ్ స్పీకర్కు తెలిపారు. జైపాల్రెడ్డి ఇలాంటి సందర్భంలో స్పీకర్కు గల అధికారాలను గుర్తుచేస్తూ ఆర్టికల్ 367 (3) ద్వారా ఓటింగ్ అవసరం లేకుండానే బిల్లుకు మద్దతిచ్చే సభ్యులు,పార్టీల ఎంపీల తలలు లెక్కిస్తే (హెడ్ కౌంట్)సరిపోతుందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల సంఖ్యే మూడింట రెండొంతులకుపైగా ఉందని, బిల్లు ఆమోదానికి సింపుల్ మెజారిటీ చాలని సూచించారు.బిల్లు పై మాట్లాడవలసిందని హోం మంత్రి షిండేను స్పీకర్ కోరారు. అనంతరం ప్రతిపక్షనేత సుష్మా స్వరాజ్ కు అవకాశం ఇచ్చారు. ఆ తరువాత జైపాల్రెడ్డిని మాట్లాడమని సోనియా సూచించారు. రెండు ప్రధాన పార్టీలు బిల్లుకు మద్దతివ్వడంతో మూజువాణి ఓటుతో లోకసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ బిల్లుపై మజ్లిస్, బీజేపీ, ఇతర పార్టీలు చేసిన సుమారు 38 సవరణలన్నీ తిరస్కరించబడ్డాయి. ప్రతి సవరణపైనా ఓటింగ్ జరిగింది. విపక్షాల సవరణలన్నీ వీగిపోయాయని మంత్రి నారాయణ స్వామి ప్రకటించారు. దీంతో సంతోషంగా సభలోనుంచి బయటికి వచ్చారు తెలంగాణ ఉద్యమనేత, ఎంపీ కేసీఆర్. తెలంగాణ ఎం.పీలంతా సంబురంగా సభ బయట ఉన్నవారిని ఆలింగనం చేసుకున్నారు.
ఆంధ్ర ఎంపీలకు తెలంగాణ బిల్లును రాజ్యసభలో అడ్డుకుంటామనే ఆశ ఇంకా పోలేదు. ఏదో ఒక సవరణను రాజ్యసభ ఆమో దించేలా చేస్తే చాలు. ఆ బిల్లు లోక్సభలో ఓటింగ్కు వెళ్ళాల్సి ఉంటుంది. అప్పటికే 15వ లోక సభ రద్దయింది. వచ్చే ప్రభుత్వం నరేంద్రమోదీదే అయితే ఆయన తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇదే జరగాలని వెంకయ్య నాయుడు, ఆంధ్ర ఎంపీలు కోరుకున్నారు. రాజ్యసభ బిల్లును ఆమోదిస్తుందో లేదోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది .ఫిబ్రవరి 19న తెలంగాణ బిల్లు రాజ్యసభకు వచ్చింది. గందరగోళం మధ్య పలుమార్లు సభ ను వాయిదా వేయవలసి వచ్చింది. ఫిబ్రవరి 20 న కూడా గందర గోళం నెలకొన్నది. ఆంధ్ర ఎంపీలంతా స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. పలుసార్లు సభను వాయిదా వేసిన రాజ్యసభ చైర్మన్ కురియన్ అన్ని పార్టీలనేతలను తన ఛాంబర్కు పిలిచి సభను సజావుగా జరగనివ్వాలని కోరారు. సాయంత్రం నాలుగింటికి సభ కొలువుదీరింది. తెలంగాణ
బిల్లుపై ప్రధాన పార్టీలకు ఏకాభిప్రాయం ఉన్నదని, చర్చ మాత్రమే జరగాలని సభ్యులు పట్టుబడుతున్నారని చైర్మన్ కురియన్ సీట్లోంచి లేచిప్రకటించారు. హోం మంత్రి షిండే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టగా, దీనిపై సాధారణ చర్చకు అనుమతిస్తున్నట్లు కురియన్ ప్రకటించారు.
వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ కొన్ని అంశాలపై వివరణ కోరగా మంత్రి జైరాం రమేశ్ సమాధానాలిచ్చారు. బిల్లులోని వివిధ క్లాజులను మూజువాణి ఓటు తో ఆమోదించారు. వెంకయ్యనాయుడు ఓటింగ్కు పట్టుబడుతూడివిజన్ను కోరగా సభ్యుల ఆందోళనల నడుమ డివిజన్ జరపలేమని, లోకసభ మాదిరిగానే జరుగుతుందని కురియన్ స్పష్టంచేశారు. పలు సవరణలను ఒక్కొక్కటిగా వెంకయ్య నాయుడు ప్రవేశ పెడుతూవచ్చారు. ఒక్కొక్క సవరణను సభ మూజువాణి ఓటుతో తిరస్కరిస్తూ వచ్చింది. పలు పార్టీల సభ్యులు సవరణలు సూచిస్తూ ఇచ్చిన నోటీసులను కురియన్ అడిగినపుడు వారు ఆ సవరణలను ప్రవేశపెట్టడం లేదని తెలిపారు ప్రధాని మన్మోహన్ సభలోనే ఉన్నారు. ఏడేండ్ల పాటు ఆంధ్రకు స్పెషల్ స్టేటస్ ఇస్తామని ప్రధాని తెలిపారు.ఈ గందరగోళాన్ని సభ గ్యాలరీ నుంచి గమనిస్తున్న కేసీఆర్కు,ఇతర ఎంపీలకు ఒక దశలో తలలో నరాలు చిట్లింత టెన్షన్ కలిగింది.ఒకదశలో తాను కన్నీళ్ళు పెట్టుకున్నట్లు కేసీఆర్ ఆ తర్వాత తెలిపారు. రాజ్యసభలో ఏ సవరణా ఆమోదం పొందలేదు. మూజువాణిఓటుతో 'ది బిల్ ఈజ్ పాస్ట్' అని కురియన్ ప్రకటించారు.తెలంగాణ ప్రజల చిరకాల వాంఛనెర వేరింది. అందరి కండ్లల్లోఆనంద బాష్పాలు! ఆనాడు తెలంగాణను ఆంధ్రతో విలీనం చేయడానికి ముందు పార్లమెంట్ భవన సమీపంలోని హైదరాబాద్ హౌజ్లోనే 1956 ఫిబ్రవరిలో సరిగ్గా 20 తేదిన 'జెంటిల్ మెన్ అగ్రిమెంట్' పై సంతకాలు జరిగాయి. 57 ఏండ్ల తర్వాత 2014లో ఫిబ్రవరి 20న ఆంధ్ర నుంచి
తెలంగాణ వేరుపడాలనే నిర్ణ యం జరిగింది.
ముడిపడ్డ రోజే వేరు పడటం యాదృచ్ఛికమే.
(వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకులు)
Sunday, February 19, 2023
మన నాయకుడు ఉద్యమ ప్రతిబింబం || వ్యాసకర్త - రాష్ట్ర శాసన మండలి సభ్యులు
మన నాయకుడు ఉద్యమ ప్రతిబింబం
గొప్ప ప్రయత్నాలు, గొప్ప ఆలోచనలన్నీ
హేళనతోనే మొదలవుతాయని
అల్జీరియాకు చెందిన రచయిత,
తత్వవేత్త, నోబెల్ గ్రహీత ఆల్బర్ట్ కామూ అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ పునర్మిర్మాణంలో
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదుర్కొన్న
సవాళ్లు, విమర్శలు, ఆరోపణలకు పై వ్యాఖ్యలు సరిగ్గా
సరిపోతాయేమో! ఉద్యమంలో గానీ,
పాలనలో గానీ విమర్శలు ఎన్ని
వచ్చినా కేసీఆర్ కుంగిపోలేదు.
రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది.
ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది' అన్న తన సంకల్పం ముందు అన్నీ
పటాపంచలయ్యాయి. ఏపీ నుంచి వెళ్తున్నాను. తిరిగి తెలంగాణ
రాష్ట్రంలోనే అడుగుపెడతాను' అని తెలంగాణ బిల్లు
పార్లమెంట్లో పెట్టేముందు హైదరా బాద్ నుంచి ఢిల్లీకి వెళ్తూ కేసీఆర్
చెప్పిన మాటలు ఆయన ఆత్మవిశ్వాసానికి, దృఢచిత్తానికి తార్కాణం.
కేసీఆర్ తాను ఏ కార్యక్రమం చేపట్టినా దానికి సంబంధించిన సమగ్ర సమాచారం
తెలుసుకుంటారు. దానిపై విస్తృతంగా అధ్యయనం చేస్తారు. మేధోమథనం జరుపుతారు.
కార్యాచరణ ప్రకటించడా నికి ముందే పక్కా ప్రణాళిక రూపొందించుకుంటారు.
స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలోను,
తర్వాత పాలనలోనూ తనదైన గట్టి ముద్ర వేయడానికి
గలకారణం ఇదే. ఉద్యమ ప్రతిబింబంగా తనను తెలంగాణ ప్రజలు
బలంగా నమ్మడానికి కేసీఆర్కు గల ఈ అసమాన వ్యక్తిత్వమే
దోహదపడింది. కేసీఆర్ ఉద్యమ నాయకత్వానికి సమాయత్తమయ్యే ముందే
తనకు అలవాటైన విస్తృత అధ్యయనంలో
భాగంగా దాదాపు ఏడు నెలల పాటు ప్రతిరోజూ తెలంగాణవాదులతో చర్చలు
జరిపారు. తెలంగాణకు జరిగిన అన్యాయాలు,
గతంలో తెలంగాణ ఉద్యను లోపాలు, తెలంగాణ సమస్యలు, పరిష్కారం,
ప్రత్యేక రాష్ట్రసాధన, దానిలో ఎదురయ్యే సవాళ్లపై
సంపూర్ణంగా అవగాహన పెంచుకున్నారు. పక్కగా ఉద్యమ రచన
చేసుకొని కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టారు.
అటు రాజకీయ పునరేకీకరణతో పాటు ఇటు ప్రజా బాహుళ్యం
లోకి ఉద్యమాన్ని విస్తృతంగా చొప్పించి, ఎక్కువ కాలం పాటు
ఉద్యమ ఆకాంక్షను ప్రజల్లో సజీవంగా ఉంచడంలో కేసీఆర్ మాట
తీరు ఎంతో ఉపకరించింది. ఉద్యమంలో సబ్బండ వర్గాలను
భాగం చేయడం, ప్రతి సభలో తాను చెప్పాల్సిందంతా సరళంగా,
హాస్యోక్తులతో చెప్పి చివరికి మీరే నిర్ణయం తీసుకోవాలి. మనమిప్పుడు ఏం చేద్దాం?
విజ్ఞతతో ఆలోచించండని నిర్ణయాన్ని ప్రజలకే వదిలివేసేవారు.
అలా ప్రజల్లో ఆలోచన రేకెత్తించేవారు.
ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆధ్వర్యంలో లక్షలమందితో జరిగిన సభలు రికార్డులు
నెలకొల్పాయంటే అది కేవలం ఆయన
వాక్చాతుర్యానికి నిదర్శనం..
కొట్లాడి తెచ్చుకున్నంత మాత్రాన కోరుకున్న తెలంగాణ కాదు'
అని ముందే ఎరిగిన కేసీఆర్ ఉద్యమ ట్యాన్లైన్ అయిన
'నీళ్లు,నిధులు, నియామకాలు' అనే ఆకాంక్షలను చాలా కొద్దికాలంలోనే
సాధించి దేశానికే మార్గ నిర్దేశకుడయ్యారు. 24 గంటల కరెంటు,
కాళేశ్వరం జలాలు.. ఇలా ఉమ్మడి రాష్ట్రంలో అసాధ్యమనుకున్న
ప్రతి దాన్ని సుసాధ్యం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఉద్యమ
నాయకత్వ బాధ్యతలను తన భుజాల మీద వేసుకొని
ఆమరణదీక్షతో ప్రాణ త్యాగానికి సిద్ధమై రాష్ట్రాన్ని సాధించారు.
దేశానికి స్వాతంత్య్ర్యం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నప్పటికీ దేశం
ఇంకా అభివృద్ధి చెందిన దేశంగానే ఎందుకున్నదన్నది కేసీఆర్
ఆవేదన. అందుబాటులో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకుంటే
చేయగల అద్భుతాలేంటో ముఖ్యమంత్రిగా తెలంగాణలో చేసిచూపించారు కేసీఆర్.
దేశ రాజకీయాల్లో గుణాత్మకమార్పు కోరుతూ బీఆర్ఎస్ ను స్థాపించారు.
'ఈ రోజు దేశానికి ఒకలక్ష్యం ఉన్నదా? లక్ష్యం లేకుండా, దేశం ఎటు వైపు పోతుంది?
చివరికి ఎక్కడికి చేరుతుంది?' అని బీఆర్ఎస్ స్థాపనకు ముందునుంచి కేసీఆర్ ప్రతి వేదిక
మీద సంధిస్తున్న ప్రశ్నలు అభివృద్ధిపేరుతో ఇదివరకటి కేంద్ర ప్రభుత్వాలు ప్రజలను
ఎంత మభ్యపేట్టాయో చెప్పకనే చెప్తున్నాయి. సాగునీరు, కరెంటు, ప్రాజెక్టులు,
రిజర్వాయర్లు, పంటల సాగు పట్ల కేంద్రానికి ఒక ప్రణాళిక
లేకపోవడం, దేశంలో దాదాపు 60 శాతం జనాభా ఆధారపడిన
వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తుండటం
ముఖ్యమంత్రి కేసీఆర్ను కలచివేసింది.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 16 నెలల
పాటు ఢిల్లీ వీధుల్లో పోరాడారు. అందులో 750 మంది
అమరులయ్యారు. వారి పట్ల, వారి కుటుంబాల పట్లకేంద్రం వ్యవహరించిన తీరు కేసీఆర్
కు ఏ మాత్రంరుచించలేదు. ప్రపంచానికి ఆహారం అందించే
అన్నదాత ఎప్పుడూ శాసించేస్థాయిలో ఉండాలి కానీ,
యాచించే స్థాయిలో కాదన్నది కేసీఆర్ ఆకాంక్ష.
అందుకే ఢిల్లీ పోరాటంలో అమరులైన రైతు కుటుంబాలకు రూ.3 లక్షల
చొప్పున సాయం అందించారు.
దేశవ్యాప్తంగా కేసీఆర్ లేవ నెత్తుతున్న ప్రశ్నలు సగటు భారతీయుని గుండెల్లోకి సూటిగా
చొచ్చుకుపోయాయి. అందుకే బీఆర్ఎస్కు దేశ వ్యాప్తంగా క్రమంగా ఆదరణ పెరుగుతున్నది.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఈ ఆదరణ క్రమంగా ప్రభంజనంలా
మారనున్నది. అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ నమూనా దేశానికి దిక్సూచి
అయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇప్పుడు దేశ సేవ కోసం ఒక ప్రణాళికతో ముందుకు
అడుగులు వేస్తున్న మన నాయకుడి ఆశయ సాధనలో
మనమంతా భాగస్వాములమవుదాం.
(వ్యాసకర్త: రాష్ట్ర శాసన మండలి సభ్యులు)
#చింతన#గీతాజయంతి_సందర్భంగా_గీతామృతస్నానం#DR_VAISHNAVANGRI_SEVAK_DAS #9821914642
చింతన - గీతా జయంతి సందర్భంగా .. గీతామృత స్నానం ' సకృద్ గీతామృత స్నానం సంసార మలనాశనం ' అని ' గీతా మహాత్మ్యం ' పల...
-
51 భగవద్దర్శనము లభించలేదని వ్యధ చెందకు. సర్వులలో పరమాత్మను సందర్శిస్తూ, సేవించడము అలవరచుకో. తీరిక సమయాల్లో ధ్యానమును సాగిస్తూ, హృదయపు లోతులల...