25 ఏళ్ల యాత్ర....!!
అనేక అంశాలపై దృష్టి గలవాడు
అద్వితీయ విజన్ తో ముందుకు నడిపే నాయకుడు
రాష్ట్రం అభివృద్ధే లక్ష్యంగా ఉంచి
పార్టీని స్థాపించిన పరాక్రమ పురుషుడు!
అతని మౌనం - ఒక మహా విస్పోటనం
అతని ఆలోచనలు - చరిత్రకి నిర్మాణం
నిర్వచించలేని ఊహలకు రూపం ఇచ్చి
నూతన మార్గాల్లో ప్రజల్ని నడిపించే దీపం!
ఎన్నో ఎన్నెన్నో కలలతో ముందడుగు
ప్రతి అడుగులో జాతికి ఆశల యుగం
నిర్మాణ శక్తితో, దృఢ సంకల్పంతో
నాయకుడిగా కాదు - జాతిపితగా వెలుగెత్తాడు!
వీది వీధుల్లో నినాదాలుగా మారిన స్వరం
ప్రతీ గడపను తాకిన ఉద్యమం
ఇది కేవలం ఓ పార్టీ మాత్రమే కాదు
ఇది ప్రజల నెత్తిన పెట్టిన ఆశల పతాకం!
చిన్న గెలుపులపై పొంగిపోని
చిన్న ఓటముల్లో ఆశలు కోల్పోని
గతం నుంచి గౌరవాన్ని గెలుచుకొని
భవిష్యత్ కోసం ముందుకు సాగుతున్న నౌక!
ఇది ఆరంభం, ముగింపు కాదు….. కొత్త ప్రేరణ
ఇది జయగాథ కాదు…... జీవించిన చరిత్ర
25 ఏళ్ల ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం
కోట్లాది మంది అభిమానుల రజతోత్సవ వేడుక!
No comments:
Post a Comment