Monday, February 5, 2024

ఒక సమయం వస్తుంది

 ఒక సమయం వస్తుంది

ఆ సమయంలో

ఎన్నో కష్టాలు 

చుట్టూ చేరుతాయి

ఒకదాని వెంబడి ఒకటి

ఊపిరి కూడా తీసుకోలేనంత

వెంట పడతాయి!

నీ ప్రయత్నం ముందు

నీ సంకల్ప బలం ముందు

ఎన్ని అవస్థలు ఎదురైనా

అవన్నీ ఒకరోజు

చెల్లా చెదురైతాయి!

ఉండాల్సింది కేవలం 

ఓపిక మాత్రమే!

చేసింది ఏది కూడా

వృధా కాదు

కాలం సమాధానంగా ఉంటుంది!

నాకు ఆదర్శం కేసిఆర్

కష్టపడనంత వరకు 

కలలు సాధ్యం కావు

సంఘర్షణలు ఎదుర్కోలేనంత వరకు

ఒక చరిత్ర సృష్టించబడదు!

అతని ఆలోచనలు

తరగలు తరగలుగా

నురగలు నురగలుగా

ప్రవహిస్తూనే ఉంటాయి!

అతని ఆలోచనల్లో భాగమై

పనిచేస్తూనే ఉంటాను!

- Kallem Naveen Reddy


Sunday, February 4, 2024

నమస్తే తెలంగాణ 4th Feb 2024తరువే నా గురువు

తరువే నా గురువు రచన : కోట్ల వెంకటేశ్వరరెడ్డి 9440233261 ఎక్కడో ఒక చోట నిలకడే దాని అస్తిత్వం పనిగట్టుకొని ఎవరికీ ఎప్పుడూ ఏ పాఠం చెప్పుదు దాని ఆచరణ శీలతే నేను నేర్చిన పాఠం కొన్నికొన్ని సందర్భాలు మనకంతగా అర్థం కావు అది ఊగితే గాలొస్తుందా? గాలొస్తే అది ఊగుతుందా? నిలకడ సాధించనిది తత్వం బోధపడదు ఆకులు రాలుతున్నా అది వగపు గీతాలాలపించదు. కాసిన కాయలపై రాయి విసిరినా కసితో ప్రతి హింసకు పూనుకోదు రాచి రంపాన పెట్టినా నరికి కుప్పలు వేసినా కన్నెర్ర జేయదు ఎన్ని సార్లు ధ్వంసం చేసినా చిగురు దరహాసమే సమాధానం పగవాడు అలసివచ్చినా ఆతిథ్యంలో తేడా చూపడు పక్షి, పాము, సీతాకోకచిలుక ఏదైనా ఒకటే భుజాల మీద ఊరేగింపే బోధి వృక్షం కింద కూర్చుంటే బుదొస్తుందా అంటే బుద్దుడే సాక్షి! ఉపకారం తప్ప ఏ అపకారం చేయకపోతేనే చెట్టంత మనిషంటారు! రచన : కోట్ల వెంకటేశ్వరరెడ్డి 9440233261

NAMASTHE TELANGANA & TELANGANAM NEWS PAPERS 28 APR 2024

https://archive.org/details/namasthe-telangana-28-apr-2024 https://archive.org/details/telanganam-28-apr-2024