Saturday, July 29, 2023

నమస్తే తెలంగాణ NEWS PAPER 30 జూలై 2023

 

17. ధ్యానించడం ఎలా

17. ధ్యానించడం ఎలా?  శిష్యుడు : నేనెలా ధ్యానం చేయాలో సెలవియ్యండి స్వామి : నీ ఇష్టదేవత పాదపద్మాలపై మనస్సును సుస్థిరంగా కేంద్రీకరించు. శిష్యుడు : హృదయస్థానంలోనా? సహస్రారంలోనా ఏ కేంద్రంలో? స్వామి : ధ్యానాన్ని ఈ రెండు కేంద్రాల్లోను ఆచరించవచ్చు. కాని మొదట హృదయాన్నే కేంద్రం చేసుకోవాలి. అదే నీకు శ్రేయస్కరం. శిష్యుడు : స్వామీ! 
ధ్యాన విధానాన్ని సెలవియ్యండి. స్వామి : హృదయ కమలాన్ని కేంద్రం చేసుకొని నీ ఇష్టదైవాన్ని ధ్యానించు. (ధ్యాన వివరాలు శిష్యుడు స్వయంగా గురువు ద్వారానే నేర్వాలి). శిష్యుడు : కాని హృదయం రక్తమాంసభూయిష్టం కదా! అట్టి ప్రదేశంలో భగవద్ధ్యానమా స్వామీ? స్వామి : శారీరక శాస్త్ర సంబంధిత హృదయం అని కాదు బాబూ! హృదయానికి చేరువన ఉండే అనాహతం ఆధ్యాత్మిక కేంద్రం, విశుద్ధచక్రస్థానంలో ధ్యానించాలి. ప్రారంభదశలో దేహభావనతో ఇష్టదైవాన్ని గురించి ధ్యానిస్తావు. కాని త్వరలోనే దేహస్ఫురణ కోల్పోయి, అంటె బాహ్యస్మృతి కోల్పోయి పరమానందమయమైన నీ ఇష్టదేవతా స్వరూపమే నీకు గోచరమవుతుంది. శిష్యుడు : అంటె చిత్రపటాల్లోను, విగ్రహాల్లోను కనబడే స్వరూపాన్ని ఆరాధించవచ్చా? స్వామి: చిత్రపటాలు, విగ్రహాలు సజీవ చైతన్యమయమై దీపించే నీ ఇష్టదైవస్వరూపాన్ని నీ మనస్సులో తలపింప చేయడానికి మాత్రమే సహకరిస్తాయి అని గుర్తుంచుకో. శిష్యుడు : మంత్రార్థాన్ని ధ్యానించడమంటే ఏమిటి స్వామి : మంత్రార్థమా? అది భగవన్నామం. నీకో పేరు ఉంది కదా! ఆ పేరున నిన్ను పిలిచేటప్పుడు నీ రూపం కూడ నా మనస్సులో మెదలుతుంది. అదే విధంగా భగవద్ధ్యానం చేస్తూన్నప్పుడు మంత్రోచ్చారణతో బాటు ఇష్టదైవస్వరూపాన్ని కూడ ధ్యానించాలన్నమాట. శిష్యుడు : మంత్రాన్ని మానసికంగా ఉచ్ఛరించాలా? లేక పైకి వినవచ్చేట్లు చెప్పాలా? స్వామి : ఒంటరిగా అంటే ఏకాంతంగా ఉన్నప్పుడైతే పైకి వినబడేట్లు చెప్పవచ్చు. అలా కాని పక్షంలో మానసికంగా జపించవచ్చు. శిష్యుడు : స్వామీ! ఇటీవల కొన్ని రోజులుగా ధ్యాన సమయంలో 
కళ్ళు మూసుకొన్నప్పుడు మంత్రాక్షరాలన్నీ మిలమిలా మెరుస్తూ కళ్ళ ఎదుట కనిపిస్తున్నాయి. అప్పుడు నాకు నా ఇష్టదేవతా స్వరూపం మరుగైపోతున్నది. ఏం చెయ్యాలి? 
స్వామి : నీ ఇష్టదైవాన్ని నీ మనస్సు నుండి మరుగు కానివ్వరాదు. ధ్యానమూ, మంత్రజపమూ మేళవించి చేయాలి నాయనా! అయినా నీ మంత్ర అనుభవం నువ్వు సక్రమమార్గంలో ఉన్నావనే సూచిస్తూ ఉంది. అది శుభలక్షణమే. మంత్రం శబ్దబ్రహ్మం కదా! శిష్యుడు : ఇష్టదేవతా ధ్యానం ఎలా ప్రారంభించాలి స్వామీ? స్వామి : మొట్టమొదట ఇష్టదేవత పాదపద్మాలకు ప్రణమిల్లాలి. పిదప ధ్యానం మొదలు పెట్టాలి. ఇంతకు ముందు చెప్పినట్లు ధ్యానంతోబాటు జపం కూడ చేయాలి. మంత్రం అనేది ఆధ్యాత్మిక శక్తితో కూడుకొన్నది. సాధన చేస్తూన్నకొద్దీ దాన్లోని ప్రభావం నీకు ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. (రాబోయే ప్రకరణం చూడండి) శిష్యుడు : స్వామీ! భగవంతునిలో మనస్సు లగ్నం చేయడమంటే? స్వామి : నియమం తప్పక ధ్యానించడం. వేకువజాము ధ్యానానికి అనువైన తరుణం. ధ్యానానికి ముందు భక్తి ప్రబోధకాలైన స్తోత్రాలు పఠించు. మనస్సును భగవంతునిపై నిలపడానికి ఈ పద్ధతి నీకు సహాయపడుతుంది. ధ్యానానంతరం కనీసం ఒక అరగంట సేపన్నా నిశ్చలంగా కూర్చో. ఎందుకంటే ధ్యాన సమయంలో నువ్వు ఆశించిన ఫలితం కలుగకపోవచ్చు. ధ్యానానంతరం నువ్వు విశ్రాంతిగా ఉన్నప్పుడు, నీ మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడే ఆధ్యాత్మికానుభవాలు అవగతమవుతాయి. కనుక ధ్యానం పూర్తికాగానే లోకాభిరామాయణంలో పడటం గాని, లౌకిక చింతనల్లో పడి కాలయాపన చేయడం గాని తగదు. అది ఎంతో హానికరం కూడ. గట్టిగా ప్రయత్నించి సాధన చెయ్యి. ఇష్టం లేకున్నప్పటికీ నీ సాధన క్రమాన్ని వీడకు. కేవలం యాంత్రికంగా, అనాలోచితంగా సాధన అనుష్ఠించినప్పటికీ ఎంతో కొంత ప్రయోజనకరంగానే ఉంటుంది. నిత్యం జపానికి కనీసం రెండు గంటలైనా వినియోగించాలి. రమణీయ ప్రకృతిలో, ఏకాంతస్థలంలో ఏ ఆలోచనా లేకుండా ఊరకే కూర్చున్నప్పటికీ లాభదాయకమే. శిష్యుడు : ఇష్టదేవతను గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ఇతర దేవతామూర్తులు గోచరమైతే ఏం చేయాలి స్వామీ? స్వామి : దాన్నీ ఒక శుభలక్షణంగా ఎంచాలి. నీ ఇష్టదేవతే వివిధ రూపాల్లో గోచరిస్తూన్నట్లు గ్రహించాలి. ఏకమూ అనేకమూ కూడ ఆయనే అని అర్థం చేసుకోవాలి. 
నీ ఇష్టదైవాన్ని ధ్యానించే వేళ మరో రూపం కనుక గోచరమైతే ఆ దివ్యదర్శన భాగ్యం కలిగినందుకు సంతోషించాలి. క్రమంగా సమస్త రూపాలు, కళలు ఇష్టదైవ స్వరూపంలో లీనమౌతూన్నట్లు చూడగలవు. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, తదితర పర్వదినాలన్నీ సాధనకు అనుకూలమైన దినాలు. కాబట్టి అట్టి పర్వదినాలలో జపధ్యానాలకు మరింత సమయం వినియోగించు. 
శిష్యుడు : స్వామీ! భగవద్ధ్యానానికి ముందు గురుపూజ చేయాలని శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి కదా! గురుపూజా విధానం ఎలాంటిది స్వామీ? స్వామి : గురువు, దైవం ఒక్కరేనని భావించి మొదట గురువును ధ్యానించు. తరువాత గురుస్వరూపాన్ని నీ ఇష్టదేవతా స్వరూపంలో లయం చేసి జపధ్యానాదులు కొనసాగించు. (గత అధ్యాయం చివరన చూడండి) 
శిష్యుడు : స్వామీ! పితృసేవ చేయమని సదా మీరు వక్కాణిస్తూ ఉంటారు కదా! కాని 
సన్న్యాసినై మిమ్మల్ని సేవించుకోవడం అంతకంటే ఉత్తమం కదా! స్వామి : కావచ్చు కాని 
కేవలం కాషాయవస్త్రధారణ మాత్రాన నువ్వు సన్న్యాసివి కాగలవా? వ్యాధిగ్రస్తుడైన నీ తండ్రికి సేవచేయడం నీ కర్తవ్యం. మొదట నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. దానితోబాటు నియమబద్ధమైన నీ సాధనలను కూడ కొనసాగించు. పితృసేవకూడ నీ ఆధ్యాత్మిక వికాసానికి చేదోడవుతుంది నాయనా! 18. నిష్టాపరుడవు కమ్ము! - స్వామి : నీకు ధ్యానంగాని, ప్రార్థనగాని చేసే అలవాటు ఉందా నాయనా? శిష్యుడు : లేదు స్వామీ? స్వామి : ప్రతి రోజు కొంత సమయాన్ని భగవత్పరమైన విషయాలకై వినియోగించడం మంచిది. భగవన్నామ జపం, సంకీర్తనం, ధ్యానం, మనోనిగ్రహం, మనశ్శాంతి వల్లనే సాధ్యపడతాయి. వీటిని మించి మరో మార్గం లేదు. శిష్యుడు : : ఆ ధ్యానాదుల ఆచరణ విధానం గురించి దయచేసి తెలుపండి స్వామీ? స్వామి : నీ హృదయమనే గుహాలయంలో భగవంతుని ప్రతిష్ఠించుకొని ధ్యానం చెయ్యి. లేదా సర్వమయుని చిన్మయరూపం నీ ఎట్టఎదుట ఉన్నట్లు భావించి ధ్యానించు. అదే మానసపూజ. ఆలయంలో అర్చకుడు ధూపదీప నైవేద్యాలు స్వామికి సమర్పిస్తూ ఏ రీతిలో పూజిస్తాడో అదే తీరులో నీ మనస్సున నిలిపిన అర్చామూర్తిని సేవించుకో. కాలాన్ని అనవసర విషయాలలో వ్యర్థం చేయకు. ఈ రోజే, ఈ క్షణంలోనే పూజ ప్రారంభించు. ఉదయ సాయం సమయాల్లో జపధ్యానాదులు అనుష్ఠించు. కనీసం రెండేళ్ళపాటు సాధన చేస్తే మహదానందాన్ని పొందగలవు. భావపారవశ్యంలో మునిగిపోగలవు. జ్ఞానదృష్టిని సంతరించుకోగలవు. రెండేళ్ళ నిరంతర సాధన వల్ల కొంత ఫలితం తప్పక అందుతుంది. కొందరు ఒక్క ఏడాది వ్యవధిలోనే ఆశించినంత ఫలితాన్ని సాధించగలుగుతారు. అయినా సాధన మానరాదు. కొంతకాలం గడిచాక ధ్యానాన్ని విడువలేనంతటి అనుబంధం పెనగొని తద్వారా అంతులేని ఆనందం కలుగుతుంది. ధ్యానం వేళ కూర్చోడానికి ఒక ఆసనాన్ని అమర్చుకో. దాని మీద నిటారుగా కూర్చోవాలి. ఎడమ అరచేతి మీద కుడి అరచేతిని ఉంచి, ఆ చేతులను ఎత్తి హృదయం చేరువన నిలపాలి. పవిత్ర గ్రంథాలను చదువుతూ ఉండాలి. ధ్యానానికి కూర్చోగానే సాధన నిష్టాపరుడవు కమ్ము! ప్రారంభించరాదు. మొదట కాస్సేపు ఇతర భావాలనన్నిటిని వైదొలగించి మనస్సును భావరహితంగా, శుచి ప్రదేశంగా రూపొందించాలి. ఆ పిదపే ధ్యానం ఆరంభించాలి. మొదట్లో రెండేళ్ళపాటు ఇలా కాస్త శ్రమగానే ఉంటుందిగాని పోనుపోను సులభతరమవుతుంది. సమయం చిక్కినప్పుడల్లా ధ్యానం చేసుకోవచ్చు. పని ఒత్తిడి ఉన్న వేళ యథాశక్తిని ధ్యానించి, ఆ దేవదేవునకు ప్రణామాలర్పించు. ధ్యానం మాత్రం మానరాదు. ప్రత్యేక సందర్భాలలో, ఎంతో పనివల్ల తీరికలేని నాడు మాత్రమే. ఈ క్షణకాల ప్రార్థన. అంతేకాని ఎప్పుడూ కాదు సుమా! ధ్యానానికి కూర్చునే ముందు కాళ్ళు చేతులు ముఖం ప్రక్షాళన చేసుకో. సదా సత్యమే పలుకు. స్త్రీలనందరినీ జగన్మాతృ స్వరూపిణులుగా భావించాలి. ఈ రెండు నియమాలను ఎంతో జాగ్రత్తగా పాటించాలి. వీటిని పాటించగలిగితే ఇతర నియమాలన్నిటినీ అవలీలగా పాటించవు. నీ మనస్సు భగవంతునిపై కేంద్రీకరించు. భగవంతుడు ఉన్నాడు. ఆయన ఉన్నాడా లేడా అని సందేహించకు. దేవుడు ఉన్నాడు. నా మాట విశ్వసించు. 
 19. భగవంతునిపై మనస్సు నిలుపు  మనస్సును సతతం భగవంతునిపై లగ్నం చెయ్యి. అప్పుడు నీలో ఉన్న దురాలోచనలన్నీ సమసిపోతాయి. నిత్యపూజకు విడిగా ఒక గదిని ఏర్పాటు చేసుకో. ఉదయ సాయంకాలాల్లో ఆ గదిని ఉపయోగించు. నియమానుసారం నిత్యం యథాశక్తి మేరకు జప ధ్యాన ప్రార్ధనలు ఆచరించు. భగవత్పరమైన విషయాల్లో నువ్వెంత సమయం వినియోగిస్తే అది నీ జీవితానికి అంత ఫలప్రదమని తెలుసుకో. నిస్సారమైన సాంసారిక విషయాలలో చిక్కుకుంటే, నీకు మనశ్శాంతి కరువవుతుంది. అందుకే తన అనంత కృపాకటాక్షంతో నిన్ను సన్మార్గగామిని చేయమని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాను. చూడు నాయనా! భగవద్ధ్యానం చేయనిదే నీకెన్నటికీ మనశ్శాంతి కలుగదు. నిజమైన శ్రద్ధ భక్తి జ్ఞానం అనేవి ఎంతో కాలం నువ్వు నియమంగా చేసే సాధనకు ప్రతిఫలాలన్నమాట. భగవంతునిపై మనస్సు నిలుపు కొందరు నిలకడలేని వైరాగ్యంతో సాధనలు అనుష్ఠించి భగవత్కృపను పొందలేక, బ్రహ్మానందం లభ్యంకాక భగవద్విషయంలో సంశయాత్ములు అవుతూ ఉంటారు. అందుకు కారణం అలాంటి వారికి భగవద్విషయంలో నిజమైన, నిశ్చలమైన భక్తి, తాదాత్మ్యాలు కొరవడినవని తెలుసుకోవాలి. వారికి నియమబద్ధమైన సాధనానుష్ఠానం లేదని ఇప్పుడు స్పష్టమైంది కదా! దివ్యప్రేమానురాగాలు చిగురించని మనస్సు శుష్కమై నొందుతుంది. భగవత్ప్రప్తికై ఎంతగా పరితపిస్తావో చివరకు ఆ మేరకు శాంతి చేకూరుతుంది. 'సంతోషంగా నువ్వు దీక్ష పూనితే మధ్యన ఎన్ని ఆటంకాలు ఎదురైనా విజయం తప్పదు సుమా!' అనేవారు శ్రీరామకృష్ణులు. కాబట్టి సాధనల్లో నిమగ్నుడవై వాటిని దీక్షతో సాగించు, ప్రాణాపాయం వాటిల్లినా బెదరిపోవద్దు. త్యాగాగ్ని రగుల్కోనిదే హృదయంలో భగవచ్చింతనను ప్రేరేపించడం సాధ్యం కాదు. ఈ త్యాగాగ్ని, వైరాగ్యాగ్ని అనేవి హృదయంలో ఎంతగా రగుల్కొంటే మనిషి అంతటి శాంతిని పొందగలగడం తథ్యం. శ్రీరామకృష్ణులను మూర్తీభవించిన వివేక వైరాగ్యాలుగా మేం కళ్ళారా చూశాం. కాలక్రమాన ఆయన తత్త్వం మనకు విశేషంగా అవగతమవుతుంది. చూడు నాయనా! నువ్వు అనుష్ఠిస్తున్న సాధనలను గోప్యంగా ఉంచాలే గాని, బయటకు వెల్లడించరాదు. పరమార్థంగాని, అంతరార్థంగాని అంతరంగంలో ఉన్నవే గాని బాహ్యంలో లేవు. భగవంతుడు అనంతుడు, అక్షయుడు అని తెలుసుకో. అందుకు దృష్టాంతాలే హిమాలయాలు, సాగరాలు, నీలాకాశమూ. భగవంతుని పట్ల శ్రద్ధాభక్తులు జనించని నాడు, బ్రహ్మపదార్థంలోగాని, ఆముష్మికాదులలోగాని నీకు విశ్వాసం కలుగని నాడు నిజమైన శీలం రూపొందదు, నీ నడతకు కుదురు, గుర్తింపు ఉండవు. గ్రంథ పఠనం చేసినంత మాత్రాన ఇంద్రియ నిగ్రహమూ, కామవిజయమూ చేకూరుతాయా? వట్టిది, అది గగన కుసుమం. కుండలినీశక్తి అధోగామియై ఉన్నంత వరకు మనస్సు నిమ్నస్థానాలకు సంబంధించిన విషయాలను పట్టుకొని ప్రాకులాడుతూ ఉంటుంది. కాని కుండలినీ శక్తి ఊర్ధ్వగామియైనప్పుడు మనస్సు ఆధ్యాత్మిక విషయాభిముఖంగా పయనిస్తుంది. మనశ్శాంతి పొందుతూన్నకొద్దీ మనిషి భగవద్దర్శనోత్కంఠుడై భగవంతుని ధ్యానసంకీర్తనలలో విశేషంగా మగ్నుడై బ్రహ్మానందం గ్రోలుతూ ఉంటాడు. సాధకుడు బుద్ధునిలా ధైర్యసాహసోపేతుడై ఉండాలి, నాయనా! ఆయన ఎంతటి అపూర్వ పరిత్యాగం ఒనరించాడు! భగవత్సాక్షాత్కారార్థం తన రాజ్యసుఖాలను అన్నిటినీ తృణప్రాయంగా విసర్జించాడు కదా! ఎంత కఠోర తపస్సు ఆచరించాడు. చివరికి ఎంత ఉగ్ర తపస్సు ఆచరించినా సాక్షాత్కారం కలుగకపోయేసరికి గయలోని పావన నీరాజనా నదిలో స్నానం ఆచరించి, “ఈ శరీరం శిథిలమైపోయినా సరే, ఆత్మబోధ జనించకుండా ఇక్కడ నుంచి కదలను” అని ప్రతిజ్ఞచేసి మరీ ధ్యానంలో నిమగ్నుడయ్యాడు. అంతే, జ్ఞానోదయమైంది. '' 1. “ఇహాసనే శుష్యతు మే శరీరం త్వగస్థిమాంసం నిలయం చ యాతు అప్రాప్య బోధిం బహుజన్మ దుర్లభం నైవాసనాత్ కాయ మతశ్చలిష్యతే.” చర్మం, ఎముకలు, మాంసానికి ఆవాసమైన నా ఈ శరీరం ఇక శుష్కించుగాక. ఎన్నో జన్మలకు దుర్లభమైన ఆత్మదర్శనం పొందనిదే ఈ శరీరం కదల్చబడదు.

Wednesday, July 26, 2023

ధ్యాన పోరాటం

ధ్యాన పోరాటం శిష్యుడు : స్వామీ! ఎంత ప్రయత్నించినా నా మనస్సు స్థిరంగా ఉండడం లేదు. అది నిలకడగా ఉండాలంటే ఏం చేయాలి? దాన్నెలా నియంత్రించాలి? దయచేసి చెప్పండి. స్వామి : నియమంగా జపధ్యానాదులు అనుష్ఠించడమే మార్గం. ఒక్కరోజు కూడ మానరాదు సుమా! అల్లరి పిల్లవాని వంటిది మనస్సు, నిమిషం ఊరకే ఉండదు. అందుకని నీ ఇష్టదైవంపై మనస్సును తరచులగ్నంచేసి దాన్నిఅదుపులో ఉంచడానికి ప్రయత్నించు. ఇలా చేయగా చేయగా నీకు భగవధ్యానంలో ఆసక్తిజనిస్తుంది, దాన్లో నిమగ్నుడవవుతావు. అలా రెండు మూడేళ్ళ పాటు సాధన సాగిస్తే అపరిమిత ఆనందాన్ని అనుభవించగలవు. అప్పుడు మనస్సు స్థిరపడుతుంది. ప్రారంభ దశలో జపధ్యానాలు నిస్సారంగా, నీరసంగా కనిపిస్తాయి. చేదు ఔషధంలా వెగటు అనిపిస్తుంది. బలవంతంగా భగవచ్చింతన అనే అరఖు (ద్రవరూప ఔషధం) నీ మనస్సుకు పట్టాలి. దీక్షబూని సాధన సాగించేకొద్దీ ఆనందం అతిశయిస్తుంది. పరీక్షలో ఉత్తీర్ణుడవడానికి విద్యార్థి ఎన్నిపాట్లు పడతాడో, మనస్సులో ఎంత బాధపడతాడో కదా! కాని అంతబాధను అనుభవించకుండానే భగవంతుని తెలుసుకోవచ్చు. ఎప్పుడంటావా? మనసారా భగవంతుని ప్రార్థించినప్పుడు. శిష్యుడు : స్వామీ! మీ మాటలు మాకెంతో ప్రోత్సాహదాయకంగా ఉంటాయి. కాని నేనే ప్రయత్నించినా ఎలాంటి మనోవికాసం కానరావడం లేదు. అంతా ఏదో మిథ్యగా కానవస్తున్నది. నిరాశ నన్ను ఆవరించింది. ఏం చెయ్యమంటారు? స్వామి : నేను అంగీకరించను. నిరాశకు తావు లేదు. భక్తి ఉన్నా లేకపోయినా జపం చేస్తే ఫలితం కనబడి తీరుతుంది. క్రమంగా భక్తి జనిస్తుంది. నియమం తప్పక సాధన కొనసాగించు; నీకు ఎంతో మనశ్శాంతి చేకూరుతుంది. అంతేకాదు, ధ్యానం వల్ల ఆరోగ్యం కూడ బాగుపడుతుంది. ఆరంభంలో ధ్యానం, మనస్సుతో పోరాడుతూన్నట్లు అనిపిస్తుంది. గట్టిగా ప్రయత్నించి చపల చిత్తాన్ని 'నియంత్రించాలి. దాన్ని భగవంతుని పాదారవిందాలపై నిలపాలి. ప్రారంభదశలో ధ్యాన సమయాన మెదడుకు లేనిపోని ఒత్తిళ్ళు లేకుండా జాగరూకతతో ఉండాలి సుమా! నిదానంగా పురోగమించండి, క్రమంగా తీవ్రతరం చెయ్యండి. నియమపూర్వక సాధన వలన మనస్సు కుదుటపడి, నిలకడ చెంది ధ్యానం సులభతరమౌతుంది. అప్పుడు గంటల పర్యంతం ధ్యానంలో నిమగ్నుడవైనా నీకు ఏ ఇబ్బంది కనిపించదు. గాఢనిద్ర నుంచి లేచాక అలసట తీరి మనశ్శరీరాలకు ఆహ్లాదం కలిగే రీతిలో ధ్యానానంతరం నీకెంతో హాయిగా ఉండటమేకాక అపరిమిత ఆనందాన్ని చవిచూస్తావు. మనశ్శరీరాలు రెండూ పరస్పర సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాయి. శరీరానికి బాధ కలిగితే, మనస్సుకు కూడ బాధ జనిస్తుంది. అందుకని శరీరారోగ్యాన్ని కాపాడు కోవాలంటే ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సాధకుడు ఎన్నడూ కడుపారా తినరాదు, అర్ధాకలితో ఉండాలి; సగపాలే భుజించాలన్నమాట. ధ్యానం అనుకొన్నంత తేలిక కాదు. మితిమీరి ఆరగిస్తే భూక్తాయాసం వల్ల మనస్సు అదుపు తప్పుతుంది. కామక్రోధాదులను నియంత్రించనిదే మనస్సుకి స్థిరత్వం ఉండదు. పరిపరి విషయాలకోసం పరుగులెత్తే మనస్సుతో ధ్యానం కుదరదు అలాంటప్పుడు ఎలా ధ్యానించగలవు? అందుకే కఠోర నియమనిష్ఠలను పాటించాలి. నియమ నిష్ఠలంటే ఉగ్రమైన శారీరక తపశ్చర్యలు గాని, శారీరక హింసగాని కానే కాదు. కామక్రోధాదులను జయించడమే నిజమైన తపస్సు. ('తపస్సు' అధ్యాయం చూడండి) ప్రబలమైన ఎలాటి కోర్కెనుగాని, ఉద్వేగాన్ని గాని తలెత్తనివ్వకూడదు. ధర్మం, పరమార్థం అన్నవి నపుంసకుని కోసమో లేక కామాదుల నివారణకై శరీర జవసత్త్వాలుడిగిన వ్యక్తి కోసమో ఉద్దేశింపబడినవి కావని సదా గుర్తుంచుకో. ధ్యానం చేయకుండా మనస్సును నిగ్రహించలేవు. నిగ్రహశక్తిలేని మనస్సుతో ధ్యానించనూ లేవు. 'మొదట మనస్సును నియంత్రింప నేర్వనివ్వండి, ధ్యానం సంగతి పిదప చూసుకోవచ్చులే' అనుకొన్నావో, పారమార్థిక జీవితానికి ఇక అసలు అంకురార్పణే జరగదని చెప్పాలి. అందుకే మనస్సును కుదుట పరచుకోవడం, ధ్యానించడం ఏకకాలంలో జరగాలి. అదే పద్ధతి. ధ్యానానికి కూర్చునే ముందు మనస్సులోని ఉబలాటాలను, కోర్కెలను కేవలం కలలో విషయాలుగా భావించు. అవన్నీ వట్టివి, వాటికిక మనస్సులో స్థానం లేదనుకో, వాటిని మనస్సులో చొరనివ్వకు. అప్పుడు నీ మనస్సు నిర్మలంగా ఉంటుంది. ధ్యానంలో ఉన్నప్పుడు నువ్వు దివ్యతేజస్సును గాంచవచ్చు, లేదా ప్రణవనాదాన్ని ఆలకించవచ్చు. అలాంటి దివ్యానుభూతులెన్నో కలుగవచ్చు. అంతమాత్రానే వాటి పైనే నీ దృష్టిని కేంద్రీకరించరాదు. నువ్వు సక్రమ మార్గంలో ఉన్నావన్నందుకు అవి సూచనలు మాత్రమే, అంతకుమించి మరేమీ కావు. భగవత్సాక్షాత్కారం పొందగోరితే పట్టుదలతో, ఓరిమితో సాధన సాగించు. సకాలంలో సాక్షాత్కారం లభిస్తుంది, భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు. 'తరుణం చూసి కాని తల్లి పక్షి గుడ్డును పొదుగదు’ అనేవారు శ్రీరామకృష్ణులు. ఓర్పు ఉండాలి, తొందరపడి ప్రయోజనం లేదు. ప్రయత్నించాలి, వేచి ఉండాలి. ఎదురుచూడాలంటె ఎంతో ఓర్పు ఉండాలి కదా! లేకుంటె ఎంతో భారంగా తోస్తుంది. అట్టే ఆశ, ఇట్టే నిరాశ కలుగుతుంటాయి. దుఃఖం, ఆనందం ఒకదాన్కొకటి వెన్నంటే ఉంటాయి. ఇలా రోజులు, నెలలు, ఏళ్ళు గడవగా భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.

శ్రీ శుకబ్రహ్మాశ్రమము శ్రీకాళహస్తి సాధనా బిరము 29-7-2023వ తేది నుండి 1-8-2023వ తేది వరకు

#పారమార్థికపారిజాతాలు#సులభసాధనోపాయాలు#ఆత్మపరీక్ష_భగవంతుడుఉన్నాడు_భగవత్ప్రప్తికిమార్గాలు_గురుకృప

Thursday, July 20, 2023

నమస్తే తెలంగాణ NEWS PAPER 21 జూలై 2023

నమస్తే తెలంగాణ : కాంగ్రెస్పై రైతు కన్నెర్ర - చిటుకుల మైసారెడ్డి 94905 24724

 రైతుల గుండెల్లో కాంగ్రెస్ కరెంటు మంటలు పెట్టింది. ఆ రైతుల గుండె మంటల్లోనే కాంగ్రెస్ మాడి మసవుతున్నది. నాడు చంద్రబాబు కరెంటుతో గోక్కున్నాడు. నేడు చంద్రబాబు ఏజెంట్ రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతుకు 24 గంటల కరెంటు వద్దంటున్నడు. దీంతో తెలంగాణ రైతులోకం కదిలింది.

కాంగ్రెస్పై యుద్ధం ప్రకటించింది. కరెంటు వద్దనే కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలుపుదామంటూ తెలంగాణ రైతాంగం తీర్మానం చేస్తున్నది.


మహబూబ్ నగర్  పెద్దవ్వ రైతు దేవవ్వ 

కన్నెర్ర జేసింది. సిరిసిల్ల రాజన్న ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. యాదాద్రి నర్సన్న మహోగ్రరూపం దాల్చిండు. నిజామాబాద్

రైతు నిప్పుల కొలిమై వస్తున్నడు. కరీంనగర్  కర్షకుడు కన్నెర్ర జేసిండు. సిద్దిపేట రైతుబిడ్డ  కాంగ్రెస్ తీరును ఎండగడుతూ కల్లోల

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడుతున్నడు. ఊరూరా  రైతు చర్చలు జరుగుతున్నాయి. రైతులు కాంగ్రెస్ ను కడిగిపారేస్తున్నరు. కరెంటు వద్దన్నోన్ని  అవే కరెంటు తీగలకు వేలాడదీయాలని

మండిపడుతున్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా కరెంటు చర్చనే.

నాడు కరెంటు చార్జీల పెంపుతో

తెలంగాణ ఉద్యమ జ్వాల పుట్టింది.

ఇప్పుడు కరెంటు ఇస్తున్న కేసీఆర్

ప్రభుత్వానికి అండగా ఉండాలని,

కరెంటు వద్దన్న కాంగ్రెస్ను

బంగాళాఖాతంలో కలిపేద్దామంటూ

రైతులు తీర్మానించుకుంటున్నరు.

పాలమూరు రైతు దేవవ్వ అన్నట్టు

కాంగ్రెస్ పార్టీ నాయకుల ఈపులు

పలిగేటట్లే ఉన్నయి. కరెంట్ వద్దంటూ

రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కర్షకుల

కండ్లలో కరెంట్ మంటలు పెట్టిన

కాంగ్రెస్ పార్టీకే ఎసరు తెచ్చింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం రైతు వెన్నెముకగా నిలిచింది. రైతులు సంతోషంగా ఉన్నరు. 24 గంటల నాణ్యమైన కరెంటు వస్తున్నది. పెద్దఎత్తున పంటలు పండుతున్నాయి. రైతుబంధు సాయం అందుతున్నది. వ్యవసాయం పండుగలా సాగుతున్నది. కడుపు నిండా తిని కంటినిండా నిద్రపోతున్న రైతుల్లో ఒక్కసారిగా.

కాంగ్రెస్ పుట్టించిన కరెంటు మంటలు అగ్రహం తెప్పిస్తున్నాయి.

24 గంటల కరెంటు కావాలి. మూడు పంటలు పండాలి. రైతు వ్యతిరేకి కాంగ్రెస్ మూడు గంటల కరెంటు మాకొద్దు. సీఎం కేసీ

ఆర్ ఇచ్చే 24 గంటల కరెంటు మాకు ముద్దు. కరెంటు అవసరం లేదన్నోళ్లకు తెలంగాణలో చోటులేదంటూ ఎక్కడికక్కడ రైతన్నలు మీటింగులు పెడుతున్నరు. రైతు వేదికల్లో అంతా కరెంటు గురించే చర్చ నడుస్తున్నది. తెలంగాణకు కాంగ్రెస్ శనిలా దాపురించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ శని పీడ విరగడయ్యేటట్టు తెలంగాణ నుంచి తరిమికొట్టాలని తీర్మానం చేస్తున్నరు. కరెంటు వద్దంటే ఈపులు పల్గాలి . రైతు బంధువు కేసీఆర్ మన గుండెల్లో ఉండాలంటూ తెలంగాణవ్యాప్తంగా రైతులు

నినదిస్తున్నారు..

రైతు ఉసురుపోసుకున్న వాడెవడు రాజకీయాల్లో బతికి 

బట్ట కట్టలేదు. కాంగ్రెస్ అసలు రూపం రైతాంగానికి అర్థమైంది. కరెంటు అవసరమే లేదు. ఇస్తే మూడు గంటలు చాలు 

అంటూ రేవంత్రెడ్డి రైతు వ్యతిరేకి అని తేలిండు.

కాంగ్రెస్ పార్టీ వాళ్లకు రైతులు మంచిగా బతకడం ఇష్టం లేదు. కేవలం రాజకీయాలు, అధికార యావ తప్ప రైతు బాధ అర్థం చేసుకోరు. 70 లక్షల రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఇక తెలంగాణలో దుకాణం బందయినట్టే.

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం

అమలుచేస్తున్న 24 గంటల ఉచిత

కరెంటును కాంగ్రెస్ తప్పుపడుతూ

కొత్త నాటకమాడుతున్నది. 

తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం మూడెకరాలు 

గల చిన్న, సన్నకారులు వ్యవసాయదారులున్నారని, 

అయితే ఒక ఎకరం భూమి పారించడానికి గంట

కరెంటు అవసరం పడుతుందని,

మూడెకరాలు పారించడానికి

మూడు గంటలు సరిపోతుందని చెప్తున్నది.

అంటే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత కరెంటు విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఉచిత కరెంటు విధానం తెలంగాణ రాష్ట్రంలో

అమలుచేయడం కాంగ్రెస్కు ఇష్టం లేదు. తెలంగాణ రాష్ట్రంలో సాగవుతున్న భూమిలో 60 శాతం బోర్లు, బావుల కిందనే సాగవు

తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 7 గంటలకు మించి కరెంటుని ఇవ్వలేని పరిస్థితిలో ఉండేది.

ప్రస్తుతం 24 గంటలు రైతుకు నిరంతరం నాణ్యమైన విద్యుత్తును అందించడంలో ప్రభుత్వం చూపెడుతున్న చొరవ గొప్పది.

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగానికి నిరంతర నాణ్యమైన కరెంటు ఇవ్వడం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది.

దానివల్లే వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతున్నది. వ్యవసాయంలో తెలంగాణ దేశానికి మార్గదర్శ

కంగా నిలిచింది.

రైతుల కోసం కేసీఆర్ ప్రభుత్వం అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నది. రైతుబంధు, రైతుబీమా, ఎరువులు, మార్కెట్లు,

రైతు కల్లాల వంటి సౌకర్యాలతో పాటు ఉచిత నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నది. దీని వల్లె నేడు దేశంలో అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులు సాధిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ

వెలుగొందుతున్నది. అలాంటి విద్యుత్తును కేవలం 3 గంటలు ఇస్తే చాలంటున్న రేవంత్రెడ్డికి తెలంగాణ రైతాంగం  కర్రు కాల్చి వాతపెట్టే రోజు ఎంతో దూరంలో లేదన్న నిజాన్ని పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి .

చిటుకుల మైసారెడ్డి 94905 24724


నమస్తే తెలంగాణ కుల దూషణను నిలదీయాలె! - వెంకట్ గుంటిపల్లి 949494100

కులాల పుట్టుపూర్వోత్తరాలు ఏవైతేనేమి ఈ రోజుల్లో కుల దురహంకార వ్యాఖ్యల్ని ఎవరూ సహించరు. మా కులమే గొప్ప అని ఎవరైనా అంటే ఆ కులం వారే హర్షించరు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేస్తున్న కులదూషణలు వివాదాస్పదమవుతున్నాయి. దళిత, బహుజన వర్గాలవారు ఆయన తీరుపై మండిపడుతున్నారు. కులాలను దూషణలుగా ఉపయోగించే ధోరణికి అందరూ దూరం జరుగుతున్నారు. కులాలను ఎక్కువ తక్కువగా చేసి చూడొద్దనే విషయంలో స్థూలంగా అంగీకారం వ్యక్తమవుతున్న రోజుల్లో ఎవరైనా మా కులమే గొప్ప అనే ఆధిపత్య ధోరణిలో పోతే ఏం జరుగుతుంది? ఆ పని రాజకీయ నేతలు చేస్తే జనం ఊరుకుంటారా? ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కేవలం తన కులమే గొప్ప అని చెప్పుకుంటూ మిగతా కులాలను కించపరిచే విధంగా మాట్లాడటం ఎలా అర్థం చేసుకోవాలి? ఆ పార్టీ పట్ల, ఆ నేత పట్ల బీసీ, ఎంబీసీ సమాజంలో వెగటు కలుగుతున్నది. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పదే పదే బీసీ, ఎంబీసీ, సంచార జాతుల కులాల పేర్లు దూషణలకు వినియోగించడం పరిపాటి అయింది. ప్రతి తిట్టులో వెనుకబడిన కులాల పేర్లు తీసి ఆయా సామాజిక వర్గాలను మానసికంగా వేధించడం అలవాటుగా మారింది. నీ కులం గురించి నువ్వు గొప్పలు చెప్పుకో.. కానీ మిగతా కులాల పట్ల చిన్నచూపును, కుల వివక్షను ప్రదర్శించడాన్ని ఎలా చూడాలి? ఒక మంత్రి లేదా శాసనసభ్యుడు రాష్ట్ర ప్రజలందర్ని ఉద్దేశించి అందరికీ సమాన పరిపాలన అందిస్తానని, కుల, మత భేదాలు చూపనని రాజ్యంగం మీద ప్రమాణం చేస్తాడు. కానీ, సదరు ప్రజాప్రతినిధి కేవలం కులదృష్టితోనే మాట్లాడితే ఏమనాలి? రాజకీయాలు, పాలన, కుల ఆధిపత్య ధోరణి కాసేపు పక్కన పెడితే రేవంత్రెడ్డి ప్రతి సందర్భంలో బీసీ, ఎంబీసీ కులాలను మాత్రమే ఎందుకు కించ పరుస్తున్నారు? మరి ఆ కులాలకు ఆత్మాభిమానం ఉండదా? అందుకే ఆయా కులాల నుంచి రేవంత్కు ప్రతిఘటన ఎదురవుతున్నది. ఇలాంటి నేతను ముందు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లెందుకేయ్యాలె అన్న చర్చ అనివార్యమైంది. యాదవులు పేడ పిసుకుతుంటారని కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో పాటు యాదవ సామాజికవర్గాన్ని ఆకులం నుంచి ఎదుగుతున్న నాయకత్వం పట్ల రేవంత్ కారుకూతలు కూశారు. దీనికి గొల్లకుర్మలు తమ స్వాభిమానాన్ని చాటుకునే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా దున్నపోతులతో వివిధ రూపాలలో నిరసన తెలిపారు. బలహీనవర్గాల వృత్తులను అవమానించడం తప్పని రేవంత్ కు అర్థం చేయించేందుకు ప్రయత్నించారు. యాదవులు శ్రీ కృష్ణుడి సంతతికి చెందిన వారని, ఉత్తరాదిన దైవంతో ఆ సామాజికవర్గాన్ని పోల్చుకుంటారు. తెలంగాణ బీసీల్లో యాదవులది రెండో స్థానం. ఒక క్యాబినెట్ మంత్రి, ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక రాజ్య సభ, ఎమ్మెల్సీ సభ్యులు, ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లు, ఒక ఫైనాన్స్ కమిషన్ సభ్యుడితో పాటు ఆ సామాజిక వర్గం నుంచి ఇంకా ఎందరో రాజకీయంగా ఎదుగుతు న్నారు. ఉత్పత్తి, శ్రామిక కులంగా ఉన్న గొల్లకుర్మలు ఇవాళ తెలంగాణ గొర్రెల ఉత్పత్తిలో, మాంసం ఎగుమతిలో, వ్యవసాయంలో దేశంలోనే టాప్ గా నిలుస్తున్నారు. ఆ కులాన్ని, ఎదుగుతున్న నేతల పట్ల అగ్రవర్ణ దురహంకారంతో అసభ్యంగా మాట్లాడిన ప్రతిసారి వారు తమదైన శైలిలో నిరసన తెలుపుతున్నారు. ఇక ప్రధానంగా ఇటీవల రేవంత్ రెడ్డి సంచార జాతుల పదాలను తిట్ల పదాలుగా వాడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో పిచ్చకుంట్ల కులాన్ని తిట్టుగా వాడుతూ ఘోరంగా అవమానించారు. ఆయన ఈ కులం పేరును ప్రతిసారి వాడి కనీసం విచారం వ్యక్తం చేయకుండా కరడు గట్టిన దురహంకారంతో వెళ్తున్నారన్న భావన ఆ సామాజికవర్గంలో ఉంది. గత కొన్నేండ్లుగా రాజకీయ పార్టీలు పిచ్చకుంట్ల (పి చ్చుక కుంట్ల) కులం పేరుతో తిట్లు తిడుతున్నారని అనేక సందర్భాలలో నిరసన వ్యక్తం చేసిన నోరులేని ఆ బిడ్డలు ఏకంగా తమ కులం పేరును వంశరాజులుగా మార్చుకున్నారు. వంశరాజుల పేరుతో ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసింది. ఆ తర్వాత గంగిరెద్దుల అనే కులం పేరును తరుచూ వాడుతున్నారు. సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా లోగిళ్లలో సంప్రదాయ బద్ధంగా బసవన్నలతో కనిపించే గంగిరెద్దుల వారిని కూడా తిట్ల పదాలుగా వాడి తమ అగ్రకుల అహంకారాన్ని చాటుతున్నారు. తెలంగాణలో గంగిరెద్దులు సంచారం చేయవద్దని ఆత్మగౌరవంతో బతుకాలని తెలంగాణలో వారికి ప్రత్యేకంగా ఇండ్లు కట్టించి ఇవ్వడమే కాకుండా గతంలో, ఇప్పుడు చిరు వ్యాపారాలు చేసుకునేందుకు బీసీ రుణాలు అందిస్తోంది తెలంగాణ సర్కార్. అదేవిధంగా దొమ్మరుల కులం పేరుతో ఉదాహరణలు ఉటంకిస్తూ చెలరేగిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా దొమ్మరులు నిరసనలకు పిలుపునిచ్చారు. ఇక ట్రాన్స్ జెండర్లను కూడా రేవంత్ వదలలేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 21, భారత శిక్షాస్మృతి లోని సెక్షన్ 504, అలాగే లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టంలోని సెక్షన్ 18-డీ రేవంత్రెడ్డి ఉల్లంఘిస్తున్నారని ఆ సంఘ రాష్ట్ర నాయకత్వం నిరసన వ్యక్తం చేస్తున్నది. ఇలా పేదలను తూలనాడే అగ్రకుల ఆధిపత్య అహంకారం పట్ల బీసీ, ఎంబీసీ, సంచారజాతుల సంఘాలు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ ఓ కులసంఘం నాయకుడిగా ఎలా మాట్లాడుతారు? రెడ్లే పాలించాలని ఆ సామాజిక వర్గంవారు సైతం ఆమోదించని రీతిలో ప్రకటనలిస్తున్నారు. ఇతర కులస్తులను దగ్గరికి తీయడంతో కాకతీయ సామ్రాజ్యం కూలిపోయిందని చరిత్రకు కుల విద్వేషాలు అంటగడుతున్నారు. అంటే ఆయన సెక్యులరేనా లేక ఆయన పార్టీ సెక్యులర్ పార్టీ యేనా? అన్నదానిపై బీసీ సంఘాలు చర్చిస్తున్నాయి. నిజానికి కాంగ్రెస్లోని ఈ ధోరణి వల్ల మెజారిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్తున్నారు. మిడిమిడి జ్ఞానమున్న రేవంత్ వంటి నేతల పెత్తనాన్ని భరించలేక ఆ పార్టీలోని బీసీలు ఒక్కటై బీసీల ఆత్మాభిమానం దెబ్బతీయొద్దంటూ మీడియాకెక్కిన వాస్తవాన్ని గమనిస్తున్నాం. నిజానికి కాంగ్రెస్ విధానాల పట్ల బీసీ, ఎంబీసీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అరవై ఏండ్లు దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీ, ఎంబీసీ, సంచార జాతులకు ఏం చేసిందో చర్చ పెట్టాలి. బీసీ కులగణన, సంచార జాతుల రిజర్వేషన్, ఓబీసీ వర్గీకరణ ఇత్యాదివన్నీ కేంద్రంలో అధికారంలో ఉండి ఎందుకు చేయలేకపోయిందన్న వాస్తవాలను జనాలకు విడమరిచి చెప్పాలి. పోరాడి సాధించుకున్న తెలంగాణలో సబ్బండ వర్ణాలు స్వాభిమానంతో వృత్తులను పరిరక్షించుకుంటూ ఆర్థిక ప్రగతిని సాధిస్తున్న వేళ దుష్ట కాంగ్రెస్, రేవంత్ లాంటి కుల దురహంకార నాయకత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుని తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. (వ్యాసకర్త: రాష్ట్ర ఎంబీసీ అధ్యక్షుడు)

NAMASTHE TELANGANA & TELANGANAM NEWS PAPERS 28 APR 2024

https://archive.org/details/namasthe-telangana-28-apr-2024 https://archive.org/details/telanganam-28-apr-2024