Sunday, January 14, 2024

అసలైన నాయకుడు కేటీఆర్

నమస్తే తెలంగాణ అసలైన నాయకుడు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావాలంటే ఎన్నయినా చెప్పుకోవచ్చు. కానీ, ఆయన అలా చేయలేదు. విజయం దక్కినప్పుడు ఆ క్రెడిట్ అందరికీ చెందుతుం దని చెప్పే ఆయన.. పార్టీకి ఎదురైన ప్రతికూల పరిస్థితికి మాత్రం తనదే పూర్తి బాధ్యత అని ధైర్యంగా చెప్పుకొన్నారు. తద్వారా నిజమైన నాయకుడనిపించుకున్నారు. - పాటిమీది జగన్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్న ఐప్పుడే ప్రపంచంలోనే అతి పెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ని నిర్మించామని చెప్పుకోవచ్చు. 2014లో రూ.57 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతుల విలువని 2023లో రూ.2.41 లక్షల కోట్లకు నేనే తీసుకువచ్చాను అని కూడా చెప్పుకోవచ్చు. టీఎస్ ఐపాస్, టీఎస్ టీ-పాస్ లాంటి విప్లవాత్మక మైన చట్టాలను తెచ్చి దేశ, విదేశాల అని ప్రశంసలు పొందాం అని చెప్పాచ్చు. అమెజాన్ లాంటి బహుళజాతి సంస్థ అతిపెద్ద డేటా సెంటరు హైదరాబాద్కు నేనే రప్పించానని చెప్పుకోవచ్చు. నా హయాంలోనే గూగుల్, ఫేస్బుక్, మెడిట్రాన్, సాఫ్సోల్, కవల్ కామ్, నోవార్టీస్ లాంటి సంస్థలు వాటి రెండో అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్ లో ఏర్పాటు చేశాయని చెప్పుకోవచ్చు. టీ-హబ్, టీ-వర్క్, టీ-ఇమేజ్ టవర్ ఆవిష్కరణలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ సృష్టించామని చెప్పుకోవచ్చు. నా మానస పుత్రిక అయిన ఎస్ఆర్డీపీ కార్యక్రమం ద్వారా హైదరాబాద్లో 30 నుంచి 40 ఫ్లైఓవర్లు, అండర్పస్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, పదుల సంఖ్యలో లింక్ రోడ్లు నిర్మితమయ్యాయని చెప్పుకోవచ్చు. ఒక్కమాటలో సమస్త హైదరాబాద్ రూపురేఖలను నేనే మార్చేశానని కూడా చెప్పుకోవచ్చు. నేను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే 60 లక్షల సభ్యత్వ నమోదు జరిగిందని చెప్పుకోవచ్చు. 2016లో నా వల్లే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 మంది కార్పొరేటర్లు గెలిచారని చెప్పుకోవచ్చు. 2018 సార్వత్రిక ఎన్నికల విజయంలో నాదే నంబర్ 2, నంబర్ 3 పాత్ర అని చెప్పుకోవచ్చు. సాధించిన విజయాల ప్రస్తావన ఎక్కడా లేదు. కానీ, ఇప్పుడు ఎదురైన ఓటమికి ఎమ్మెల్యేలనో, ఇతర నాయకులనో లేదా కార్యకర్తలనో బాధ్యులని చేయలేదు. ఈ వైఫల్యానికి పూర్తి బాధ్యత నాదే అని కేటీఆర్ అన్నారు. గెలిచినప్పుడు ఇది సమష్టి విజయం అని అన్నారు.. ఓడినప్పుడు పూర్తి బాధ్యత నాదే అని ఆయన అన్నారు. గతంలో దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ క్యాడర్ సర్వశక్తులు ఒడ్డినా, ప్రత్యేక పరిస్థితుల్లో ఎదురైన ఓటమికి పూర్తి బాధ్యత నాదేనని హరీష్ రావు కూడా ప్రకటించారు. మన నాయకుల లాగానే ఓటమికి బాధ్యత మనం కూడా తీసుకుం దామా? పార్టీ బలోపేతానికి, తిరిగి అధికారంలోకి రావడానికి కృషి చేద్దామా? లేదా ఓటమికి కారణం మీరంటే మీరని ఒకరిపై ఒకరం దుమ్మెత్తి పోసుకుందామా? ఇప్పటికీ తెలంగాణలో అత్యంత బలమైన పార్టీ మన బీఆర్ఎస్సే అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎమ్మెల్యేల సంఖ్య మాత్రమే తగ్గింది. 65 శాతం ఎంపీలు. 80 శాతానికిపైగా ఎమ్మెల్సీలు, 128 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 115కి పైగా చైర్మన్లు, మేయర్లు, 32 మంది జడ్పీ చైర్మన్లలో 30కి పైగా మనవాళ్లే ఉన్నారు. అత్యధిక స్థానాలలో కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అన్నిటికన్నా ముఖ్యంగా లక్షలాది మంది గులాబీ కుటుంబ సభ్యులున్నారు. ఈ స్థాయిలో అంకెలు సాధించాలంటే కాంగ్రెస్, బీజేపీలకు మరో 50 ఏండైనా వీలుకాదు. కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో విజయాలు సాధించాం. అన్నిటికన్నా చిరస్మరణీయమైన విజయం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం. సార్ నాయకత్వంలో భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధిస్తాం. ఇది మన పార్టీ, తెలంగాణ అస్తిత్వమే మనం. -జైతెలంగాణ.. జైకేసీఆర్

Saturday, January 13, 2024

రాష్ట్రాన్ని బద్నాం చేసేందుకు కుట్ర

రాష్ట్రాన్ని బద్నాం చేసేందుకు కుట్ర రాష్ట్రంలోని 33 జిల్లాలను కుదించాలనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎందుకు వచ్చిందో మేధావులకు సైతం అంతుచిక్కడంలేదు. ముఖ్యమంత్రి నెల రోజుల పాలనా తీరు చూస్తుంటే.... "మాకు పాలించే తెలివి లేదు, మీరే పాలించండి. మేం బానిసల లెక్క మీ వద్ద పనిచేస్తాం. మా వనరులు, మా సంపద దోచుకుపోండి, మేం చూస్తూ ఊరుకుంటాం..' అన్నట్టు ఉన్నది. గోగుల రవీందర్ రెడ్డి 95022 52229 సాధారణంగా ఎన్నికల్లో గెలిచిన ఏ పార్టీ అయినా మొదట ప్రజలకు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పోతుంది. ఎందుకంటే ఆ హామీలను నమ్మే ప్రజలు ఏ పార్టీకైనా అధికారం ఇస్తారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కానీ, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే పనులను కాంగ్రెస్ పార్టీ ముందటేసుకుంటున్నది. రాష్ట్రంలో పరిస్థితిని చూస్తుంటే జిల్లాలను "కుదించడంలో రేవంత్ ఎత్తుగడ ఇదేనేమో అన్న అనుమానం నాకే కాదు, యావత్ రాష్ట్ర ప్రజలకు కలుగుతున్నది. లేకుంటే ఇప్పటికిప్పుడు జిల్లాలను కుదించే అవసరం దేవంత్ కు ఎందుకు వచ్చింది. అసలు ఆ అవసరం కానీ, ఆ అవకాశం కానీ లేదు. ఉన్నపళంగా జిల్లాలను కుదించే ఆలోచన వెనుక మర్మం ఏమిటోనని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. "చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు అభివృద్ధికి చిహ్నాలు' అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ఆయన ఆలోచనావిధానం ప్రకారం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా విభజించి ప్రజలకు చక్కటి సౌకర్యవంతమైన పాలన అందిస్తే. జిల్లాలను కుదించి ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన సీఎం రేవంత్రెడ్డికి ఎందుకు వచ్చిందో మరి. రాష్ట్రంలో చిన్న జిల్లాలు ఏర్పాటయ్యాక ప్రజలకు సౌకర్యంగా మారాయి. జిల్లాకో కలెక్టర్ కార్యాలయంతోపాటు అన్ని పాలనా విభాగాలు ఒక్కచోట చేరి ప్రజాసమస్యలను గంటల్లోనే పరిష్కరించారు. ప్రజలు కలెక్టరు నేరుగా కలిసి వారి సమస్యను చెప్పి, వెంటనే పరిష్కరించుకునే అవకాశం ఉంది. జిల్లాలు కుదిస్తే ఆ అవకాశం ప్రజలకు దక్కకుండా పోతుందనడంలో సందేహం లేదు. ఉన్నతాధికారులు సైతం జిల్లా అంతటా కలియదిరిగి ఎక్కడ ఏ సమస్య వచ్చినా పరిశీలించి పరిష్కరించిన సందర్భాలను గతంలో మనం చాలా చూశాం. ఇప్పుడు జిల్లాలను కుదించాలనే ఆలోచన వెనుక పెద్ద కుట్రనే దాగి ఉన్నదనేది అందరికీ అర్ధమవుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తూ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పోకడలకు పోతున్నది. దానికి తాజా ఉదాహరణే కాంగ్రెస్ పేరు మార్చి ప్రవేశపెట్టిన 'రైతు 'భరోసా' పథకం. ఆ పథకం కింద ఎకరానికి ఏటా రూ.15 వేలు ఇస్తానని ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోగా ఇప్పటికి రైతుల ఖాతాల్లో జమచేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం సిద్ధంగా పెట్టిన 'రైతుబంధు' డబ్బులను కూడా రైతుల ఖాతాల్లో జమ చేయడం లేదు. తత్ఫలితంగా రైతులు 'రైతుబంధు' మొర్రో అని మొత్తుకుంటున్నారు. ఇక ఆర్భాటంగా ప్రవేశపెట్టిన 'మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం'లో అనేక ఇబ్బందులున్నాయి. సరైన బస్సులు లేక, బస్సులున్నా అందులో సీట్లు లేక మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుండటం అమానవీయం. ఆరోగ్యశ్రీ పరిధిని కేసీఆర్ ప్రభుత్వం ఏడాది కిందనే రూ.10 లక్షలు చేసింది. దాన్ని మరిచిపోయిన కాంగ్రెస్ నాయకులు ఆరోగ్యశ్రీ పరిధిని పెంచా మంటూ డాంబికాలు ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో చేయాల్సిన అభివృద్ధి పనులు చేస్తామన్న హామీలను పక్కన పడేసి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కుట్రలు పన్నుతున్నదని ప్రజలకు స్పష్టంగా అర్ధమవుతున్నది. స్పష్టంగా చెప్పాలంటే కాంగ్రెస్ నేతలంతా కలిసి ఆడిన నాటకంలో పాపం తెలంగాణ ప్రజలు బలయ్యారు. ఇది నూటికి నూరు పాళ్లు నిజం. కేసీఆర్ పాలనా విధానాన్ని చూసి ఓర్చుకోలేని కొందరు కాంగ్రెస్ నాయకులు, కుహనా మేధావులు ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. యూట్యూబ్ చానళ్లు ఏర్పాటుచేసుకుని ప్రజల మనసుల్లో విషం నింపిండ్రు. నోటికి ఏది వస్తే ఆది మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టడంలో సఫలమ య్యారు. నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగివచ్చినట్టు ఈలోపు జరగాల్సిన నష్టం జరిగింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు దాటింది. ఈకాలంలో అనేక తప్పుడు నిర్ణయాలు జరుగుతున్నాయి. గతంలో తప్పు తప్పు అని గొంతు చించుకున్న స్వయం ప్రకటిత మేధావులు ఎవ్వరూ ఇప్పుడు నోరు విప్పడం లేదు. ప్రశ్నించే గొంతుకలని డబ్బా కొట్టుకున్న బుద్ధిజీవులు కానరాకుండా పోయారు. పచ్చబడ్డ తెలంగాణను మంటల్లో నెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయినా ఈ కుహనా మేధావులు, బుద్ధిజీవులకు చలనం రాకపోవడం శోచనీయం. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఏనాడూ నిధుల కొరత రాలేదని ప్రజలకు తెలుసు. చిరుద్యోగులను సైతం అదరించి వారికి జీతాలు అందించిన ఘనత ఆయనది. హోంగార్డులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీల వేతనాలు పెంచిన ఘనత ఆయనది. బీడీ కార్మికులకు, నేతన్నలకు, గౌడన్నలకు, వికలాంగులకు వృద్ధులకు, బోధకాలు బాధితులకు ఇలా ఎంతోమందికి పింఛన్లు ఇచ్చిఆదుకున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. 'తిండి పెట్టే రైతన్న మరణం దేశానికి అరిష్టం" అని రైతులను ఆదుకున్న చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిది. కేసీఆర్ హయాంలో రాష్ట్రం దివాళా తీసిందని బద్నాం చేస్తూ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం చేస్తూ, రైతులకు రైతుబంధు చేయకపోవడం లాంటి కాంగ్రెస్ ప్రభుత్వ వికృతచేష్టలను ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. దేశానికి రోల్ మోడల్గా ఉన్న స్థాయి తెలంగాణది. అలాంటి తెలంగాణ స్థాయిని దేశవ్యాప్తంగా దిగజార్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగడం అత్యంత హేయం. ఎవరిది మాటల ప్రభుత్వమో, ఎవరిది చేతల ప్రభుత్వమో ప్రజలకు ఇప్పటికే అర్థమైంది.

Tuesday, January 2, 2024

ఓం

 ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులకు, విశ్వమానవాళికి శ్రీ కృష్ణ భగవానుని కృపతో విన్నపము మనము ప్రతినిత్యము భజనలు, స్తోత్రములు, పారాయణములు,ధ్యానము చేయుట వలన మనకు ఆభగవంతుని కృపలభించి అట్టికృపతో మనకు మానసికంగా, శారీరకముగా శక్తి లభించి ఆత్మ విచారణ, మోక్షసాధన చేయగలిగే శక్తిని ఆ భగవంతుడు మనకుకలుగజేయాలని భగవానుని ప్రార్థిస్తూ భగవత్ సేవలో ... మీ ఆత్మబంధువు….

Monday, January 1, 2024

సాధన సోపానాలు - స్వామి సుందర చైతన్యానంద :51 to 100

51 భగవద్దర్శనము లభించలేదని వ్యధ చెందకు. సర్వులలో పరమాత్మను

సందర్శిస్తూ, సేవించడము అలవరచుకో. తీరిక సమయాల్లో ధ్యానమును సాగిస్తూ,

హృదయపు లోతులలోకి వెళ్ళి చూడు. ధ్యానములో అంతర్ముఖ మవుతున్న

నీవు పరమాత్మకు అత్యంత సన్నిహితముగా నున్నట్లు అనుభూతి నొందగలవు.

52 మనస్సును నిగ్రహించే ప్రయత్నములో దానిని నిర్బంధించాలని

చూడకు. సరియైన అవగాహనను అందించాలి. ప్రాపంచిక జీవనము నందలి

మనస్సుతో సదా భాషించే అలవాటును చేసుకో. సద్భావాలతో మనస్సును నింపే

అభ్యాసమును కలిగి యుండుము.

53 కష్టాలెదురయ్యాయని కుమిలిపోకు. గతంలో మన మాచరించిన

దుష్కర్మలు పాపమును అంటగట్టాయి. కష్టాలు వచ్చి పాపాలను దూరం

చేయుచున్నవి. అలాగే గతములో మన మాచరించిన సత్కర్మలు పుణ్యమును

ముందుంచుతున్నవి. సుఖాలు వచ్చి పుణ్యమును హరింపజేయుచున్నవి. మన

పుణ్యమును హరించే సుఖము కన్నా మన పాపమును హరించే దుఃఖమే

శ్రేయోదాయకము కదా!

54 కర్మల మధ్య కలతచెందకు. సర్వకర్మములను భగవానుని యందు

సన్యసించి నిర్మలంగా ఉండు. నీవు పాత్రధారివి. భగవానుడు సూత్రధారి. 

ఈ సత్యాన్ని సదా జ్ఞాపక ముంచుకొని జీవించు. తరువాత నీ జీవితము 

దేదీప్యమానమై వెలిగిపోగలదు.

55 కర్మలను సన్యసించాలని భావించకు. కర్మలలో సన్యాసమునుదర్శించే 

అలవాటు చేసుకో. అహంకార, మమకారాలను వీడి నీవు ఆచరించే ప్రతి

కర్మయును సన్యాసానికి ప్రతిరూపమే అవుతుంది.

56 సూర్యుడు ప్రకాశించుచునే యున్నాడు. మబ్బుయే అడ్డు నిలిచి

ప్రకాశాన్ని ఆటంక పరచింది. మబ్బు తొలిగితే సూర్యదర్శన మవుతుంది. అలాగుననే

అజ్ఞాన మబ్బు తొలగగానే ఆత్మజ్ఞాన భాస్కరుడు స్వప్రకాశచైతన్యమై భాసిస్తాడు.

57 సహనము ఉత్తమమైన సుగుణము. సహనశీలుడు ఎన్నడైనను

విజయుడే. సహనశీలుడగు వానిని బాధలు కదిలించలేవు. ఈర్ష్యలు అతనికి

అర్థంగావు. అసూయలు తెలిసిరావు. అపకారికి కూడా ఉపకారమును చేయు శక్తి

సహనశీలునికి ఉండును. తనను గునపముతో కొట్టెడి వానిని కూడా భూమి

సమానముగనే భరించును కదా?

58 ప్రేమ చాలా పవిత్రమైనది. అది బ్రతుకునే పావన మొనర్చును.

ప్రేమించడము ఒక కళ. ప్రేమించే నేర్పు నీకు అవగత మయితే నీ ప్రేమ

జడరూపాలను చైతన్యవంతము చేస్తుంది. అజ్ఞానమును జ్ఞానముగా మార్చుతుంది.

ఆవేదనను ఆనందముగా తీర్చుతుంది. ప్రేమజీవియే ధన్యజీవి.

59.బాధల మధ్య సాధకుడు చెదరిపోకూడదు. నిన్ను బాగుచేసేందుకే

బాధ లొస్తున్నాయని భావించు. బాధలలోనే నీ బ్రతుకు శోభాయమానముగా

తయారవుతుంది. మనోహరమైన కాంతిని వెదజల్లే ముందు బంగారు నిప్పుల్లో

ఎంతగా కాలినదో, సమ్మెటపోట్లను ఎంతగా భరించినదో ఆలోచించు.

60 మాటలకన్నా మౌనమే నీ చేత బాగా మాట్లాడిస్తుంది. ఆధ్యాత్మిక

సాధకుడు అధికప్రసంగి కాకూడదు. ఎవరైన ప్రశ్నిస్తేనే మాట్లాడు. నీకు నీవుగా

వ్యర్థప్రసంగాలను చేయకు. అసహ్యకరముగా ఎవరైనా మాట్లాడుచుండినచో,

ఈ ప్రపంచ వైఖరిలో ఇలాంటిది అని సరిపెట్టుకొని స్థిమితముగా,ఉదాసీనముగా ఉండు.

61 నీ గొప్పతనమును చాటుకొనే వచనములను పలుకకు. సామాన్యుని

వలె నమ్రతగా ఉండటము అలవరచుకో. నిన్ను గూర్చి నీవు చెప్పుకొనుచున్నంత

కాలము నీవు చిన్నవాడివే. నీవు గొప్పవాడివి అయ్యావా? ఇతరులే నిన్ను గూర్చి

ప్రశంసిస్తారు.

62 వారానికి ఒక్క రోజు చక్కెర లేకుండా పానీయము తీసుకో. టీ గాని,కాఫీ గాని, పాలు గాని ఏది నీవు తీసుకొన్నను పంచదారను దానిలో మినహాయించు.అప్పుడప్పుడు ఇలా చేయుచు వరుసగా ఒక వారం రోజులు పూర్తిగా పంచదారను వాడుట మానివేయి. మనస్సు తీపిపై మరలగానే మాధవుని నామమును బిగ్గరగా గానము చేయి. నాలుక తియ్యగా మారుతుంది. జిహ్వను జయించలేని జీవికి జీవితములో శాంతి లభించదు.

63 అందరిలోను పరమాత్మను వీక్షిస్తూ జీవించు. దయ నిండిన పలుకులే

నీనుండి కదలనీ. ఈ ప్రపంచము అనిత్యమనెడి భావనను సదా మదిలో కలిగియుండు.

సర్వులను ప్రేమిస్తూ ఉండు. నీవు ప్రేమించినవారు నిన్ను ప్రేమించాలని

ఆశించకు. అనంతుడైన భగవానునికి అనేక శరీరాలు. నీవు ఒకరికి మేలు చేయి.

మరొకరి ద్వారా భగవానుడు నీకు మేలుచేస్తాడు.

64 సదా సత్యమునే భాషించుము. భగవానుడు సత్యరూపుడు. నిత్యము

సత్యమును భాషించు వానికి వాక్షుద్ధి లభించును. వాక్షుద్ధి గలవాడు ఏది

తలచినను, పలికినను నిరాటంకముగా జరిగిపోవును. వాక్షుద్ధి నీకు అలవడినచో

ద్విగుణీకృతముగా నీవు ప్రపంచానికి సేవ చేయగలవు.

65 సంసారజీవనము లోని దుఃఖములను సదా దర్శించే అలవాటును

సాధకుడు అలవరచుకోవాలి. మృత్యువును గూర్చి సదా భావన చేయుచూ ఉండాలి.

మహాత్ముల చెంతగాని, లేదా సత్సంగము నందుగాని ఆధ్యాత్మిక స్ఫూర్తిని

పొందుతూ ఉండాలి. అనుక్షణము భగవానుని స్మృతియందుంచుకొని జీవించాలి.

సాధకుడు ఈ నాలుగు విషయాలను మరువరాదు.

66 నిత్యము ధ్యానము చేయు అలవాటును చేసుకో. ధ్యానజీవనమే

ధన్యజీవనము. ధ్యానములో కొద్దిగా ప్రగతిని సాధించగనే బ్రతుకులో మాధుర్యాన్ని

నీవు చూడగలవు. ప్రారంభములో కొన్ని ఒడుదుడుకులు ఏర్పడవచ్చు. ధ్యానములో

అంతర్ముఖ మవుతున్నకొద్దీ ఆవేదనలన్నీ పూలరేకులవలె రాలిపోవును.

67 ప్రపంచము నిత్యమని భావించుచున్నంత కాలము కామధేనువు చెంతనే 

యున్నను కష్టాలు తప్పవు. పరమాత్మయే శాశ్వతమని తెలియగనే కౌపీనధారి 

కూడా కలిమి గలవాడే యగును. ప్రపంచాన్ని విస్మరించు. పరమాత్మను స్మరించు.

68 శీలం దూరమైన వాడు పండితుడైనను వాసన లేని పూవువలె వ్యర్థ

జీవియే యగును. శీలము అతి పవిత్రమైనది. దానిని కాపాడే ప్రయత్నములో

శరీరము నేలరాలినను ఫరవాలేదు. కీర్తిధృవతార నిలిచియే ఉంటుంది.

69 శుద్ధిపడిన హృదయము అభేదదర్శనము చేయగలుగుతుంది. నిస్వార్థ

ప్రేమ నీ హృదయములో నిండగనే, నీ బ్రతుకును నడిపేందుకు భగవంతుడే దిగి

వస్తాడు. అంతవరకు నీ బ్రతుకును నడుపుతున్నది అహంకారమే నని, తద్వారా

లభించేది వినాశమే నని మరువకు.

70 సత్యరూపుడవు కావలెనని వాంఛించే నీవు సత్యజీవనమును సాగించక

తప్పదు. ముదుసలి కర్రపై ఆధారపడి నడుస్తాడు. తనకు ఆధారమైన కర్రను తాను

మోసినపుడే అది అతనికి ఊతగా నిలుస్తున్నది. నీవునూ సత్యజీవనమును

సాగించినపుడే సత్యరూపమును దర్శించగలవు.

71 నిన్ను భగవంతుడు నడిపించాడా! నీవు ద్వంద్వాలకు అతీతుడవయ్యావనే తెలుసుకో. మనస్సు సున్నిత మవుతుంది. హృదయం విశాల మవుతుంది. 

బ్రతుకు ఉజ్వలమై ప్రకాశిస్తుంది.

72 నిద్రనుండి లేవగనే “భగవాన్! ఈనాడు నేను ఎవ్వరినీ బాధించను.

ఎవరి హృదయాన్ని గాయపరచను" అని ప్రతిజ్ఞ చేయి. రాత్రి పరుండే ముందు

“భగవాన్! నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. నేను ఎవరినీ బాధించలేదు.

ఇదంతా నీ అనుగ్రహ ప్రసాదమే" అని నమస్కరించు.

73 “ఆలయానికి వెళ్తున్నాను" అంటావు. ఆలయ మొక్కటియే భగవన్నిలయమని 

నీ అభిప్రాయము కాబోలు. విశాలవిశ్వ మంతయూ దివ్యాత్ముని ఆలయమే నని నీకు తెలిసిననాడు నీవు నిలిచినచోటే భగవన్నిలయ మవుతుంది.

74 నీవు అసంఖ్యాకమైన గ్రంథములను రచించవచ్చు. అనర్గళముగా

ఉపన్యసించవచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలివియని పదుగురిచే స్తుతించబడవచ్చు.

హృదయంలో ప్రేమను పోగొట్టుకొన్నచో ఇవి యన్నియు శవసౌందర్యములే కదా!   

75 చింతలలో చరించే వింతజీవనానికి స్వస్తి చెప్పు. సాధకుడవైన నీవు

నిత్యము ఆనందరూపుడవై ఉండాలి. చితి మృతకళేబరాలను దహిస్తే, చింత

ప్రాణమున్న దేహాలనే దహించివేస్తుంది.   

76 పరిస్థితులను గూర్చి పలవరించకు. విషమ పరిస్థితుల మధ్య కూడా

విమలచిత్తుని వలె జీవించు. భిన్న పరిస్థితులు తలఎత్తినపుడు, నీ మానసిక

ప్రపంచములో నీవు ఉండేందుకు ప్రయత్నించు. భగవంతుడు పంపగా నిన్ను

మలిచేందుకు వలచి వచ్చినవే విపత్తులని మరచిపోకు.

77.“నేను చట్టబద్ధముగా, న్యాయసమ్మతముగా, ధర్మయుతముగా జీవించుచున్నాను. మరి నాకు కష్టాలెందుకు సంభవిస్తున్నాయి?" అంటావు.

మిత్రమా! నీ చట్టాలు, ధర్మాలు వ్యక్తిపరంగా నడిచే నియమాలు. సమిష్టపరంగా,

దైవపరంగా ఆలోచించి చూడు. నీ బాధలకు నీవే ఎలా కర్తవో నీకు బోధపడుతుంది.

78.రుచి చూడని నీకు రుచి తెలిసే అవకాశము లేదు. రుచి తెలియని నీకు

రుచిని తెలిపే హక్కు అసలేలేదు. అనుభవమునకు అందని విషయాన్ని ఇతరులకు

అందించే ప్రయత్నము ప్రమాదకరము. మిత్రమా! ఆత్మరుచిని అనుభవించు. ఆ

తరువాత ఇతరులకు అందించుదువు గానీ! రుచి చూడని నీకు రుచి చూపాలనే

అభిరుచి ఎందులకు?

79.వ్యక్తిభావన ముక్తిని ఆటంకపరుస్తుంది. వ్యక్తిభావనను విశ్వభావములో

లయింపజేయి. విశ్వభావములో విశ్వచైతన్యము నిండియున్నందున నీకు విశ్వనాథుడు

గోచరిస్తాడు. అప్పుడు భిన్నత్వములో ఏకత్వాన్ని దర్శించగలవు.

80.భగవంతుని దయ నీపై వర్షించనంతవరకు దానిని గూర్చి నీవు

గ్రహించలేవు. భగవత్కృప నీపై పడగానే అప్పుడు నీకు సత్యం తెలిసివస్తుంది. "ఆ

దయకు నేను అర్హుడనా?” అన్న సందేహం కూడా కలుగుతుంది. మిత్రమా!

భగవత్కృప కర్మకు ఫలితం కాదు. ఆ దయామయుని అనంత ప్రేమకు నిదర్శనం.

81 భగవానుడు అందరిలోను దాగియున్నాడు. నీతో భాషించే ప్రతి

ఒక్కరి పలుకు వెనుక భగవానుడు కులుకుతూనే ఉన్నాడు. నీ హృదయాన్ని సదా

తెరచియే ఉంచు. పసిబిడ్డ వలె నిర్మలంగా ఉండు. ప్రతి జీవిని భగవత్స్వరూపముగా

దర్శించుచూ ప్రేమించే అలవాటును అలవరచుకో.

82 భగవంతుని ధ్యానించగనే నీవు విశ్వచైతన్యముతో ముడిపడి ఉంటావు.

వెంటనే అపరిమిత శక్తిమంతుని వలె మారుతావు. ధ్యానము శక్తిని, ప్రకాశాన్ని నీకు

అందించి నిన్ను ప్రభావితుడ్ని చేస్తుంది. ధ్యాన జీవితాన్ని ఎన్నడూ దూరం చేసుకోకు.

83 సోదరా! శాంతియే నీ జన్మహక్కు. బలమే నీ కులము. పిరికితనాన్ని,

అశాంతిని పారద్రోలు. "అహం బ్రహ్మాస్మి" అని సింహకిశోరము వలె గర్జించు.

అమృతస్వరూపుడవైన నిన్ను మృత్యువు కూడా కదిలించలేదు.

84 నేస్తమా! నీవు ముక్తస్వరూపుడవు. నీ స్వేచ్ఛను అమ్ముకోకు. ఇతరుల

భావాలకు నీ మనస్సును ధారబోయకు. నీమీద నీవు ఆధారపడు. నీవు నమ్మిన

దానినే ఆచరించు. గొర్రెలన్నీ గుంపుగా వెళ్ళనీ సింహకిశోరమైన నీవు నీకంటూ

ఒక దారిని ఏర్పరచుకో.

85 పాపము చేసినందులకు వగచకు. పాపమొక భూతము కాదు.

పొరపాటు మాత్రమే. సరిచేసుకుంటే సరిపడిపోతుంది. జ్ఞానజాగరణలో సర్వసమస్యలు,

సమస్త పాపములు లయించిపోతాయి. పాపము జరిగిందని స్వప్నప్రపంచములో

కూర్చొని విలపిస్తావెందుకు? మేలుకొని చూడు. అయ్యోపాపమని

పాపాన్ని ఓదార్చేవాడివి నీవే అయివుంటావు.

86 సాధకా! అభిరుచుల్ని దూరం చేసుకో. అహంకారాన్ని ఆవల నుంచు.

అర్హులైన వారికి సేవల నందించు. సర్వులను సమముగా వీక్షించు. ధ్యానహృదయముతో

కదులుతూ ఉండు. శాంతి నీ స్వరూపమై మిగులుతుంది.

87 వస్తువులను దహించే శక్తి అగ్నికి ఉన్నట్లు, పాపాలను దహించే శక్తి

భగవన్నామాని కుంది. విరామసమయాల్లో విచారముతో సాగక, భగవన్నామాన్ని

ఆంతర్యములో కొనసాగించే అభ్యాసమును కలిగియుండు. నీ హృది సదా

ఆనందముతో నిండుతుంది.

88 ప్రేమచే క్రోధాన్ని జయించు. నమ్రతచే అభిమానాన్ని దూరం చేసుకో,

శరణాగతిచే అహంకారాన్ని అంత మొందించు. సేవచే ద్వేషాన్ని రూపుమాపు. ఇవన్నీ

జరిగాయా! ఇక నిన్ను మించిన భాగ్యవంతుడు ఈ ప్రపంచములో మరొకడుండడు.

89 ఎక్కువగా ఆలకించు; తక్కువగా ఆలపించు. ఎక్కువగా ఇచ్చుకో;

తక్కువగా పుచ్చుకో. ఎక్కువగా ఆచరించు; తక్కువగా ప్రవచించు. ఎక్కువగా

ఆలోచించు; తక్కువగా చదువు. ఆ తరువాత నీలో తరిగేదేమిటో పెరిగేదేమిటో

నీకే అర్థమవుతుంది.

90 మృత్యువంటే నీకు భయమా? మృత్యువును చూసి నీవు పారిపోతావా?

అయితే విను. నిజమైన మృత్యువేమిటో చెప్పనా? మమకారమే మృత్యువు.

నిర్మమకారమే అమృతత్వము. ....... ఇంకా చూస్తావేం? మృత్యువుకు దూరంగా

వెళ్ళు.

91 నిష్కామ్యభక్తిని కలిగియుండు. కోరికలను మదిలో నింపుకొని గుడి కెళ్ళకు.

అడగనవసరము లేకనే అందించువాడు అచ్యుతుడు. నీ అవసరాలు నీకన్నా

అతనికే బాగా తెలుసు. భక్తి చేయుట ఒక్కటియే నీవు చేయవలసిన పని.

92 గురుబోధలో బ్రతుకును పండించుకో. గురువైనవాడు మహిమలు

చేస్తాడని, చేయాలని అభిప్రాయపడకు. అవన్నియు చౌకబారు ప్రదర్శనలు. నీగురువు నీహృదిలో నిలవడమే గొప్ప మహిమయని మరువకు.

93 ఓ సాధకా! ఇతరులు వాడిన చెప్పులను ఎట్టి పరిస్థితులలోను వాడకు.

ఇతరుల పడకపై పరుండకు. తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా ఆలోచించే

సదలవాటును తప్పక కలిగియుండు.

94 కోరికలు నిన్ను అశాంతికి గురిచేస్తాయి. లభించిన దానితో

తృప్తిపడటము అలవరచుకో. నీవు సక్రమమార్గములో నడచునపుడు అన్యుల

విమర్శలను లెక్కచేయకు. అలాగని అన్యులుచేయు స్తుతులు నీకు ఉపకరిస్తాయని

భ్రమపడకు. అవి మరీ నీ బ్రతుకును కృంగదీస్తాయి.

95 ఎవరైనా నిన్ను నిందించినపుడు వ్యథచెందకు. ఉద్రేకమును ప్రదర్శించకు.

చక్కగా విచారణను కొనసాగించు. వారు చేసింది పదముల గారడియే

కదా! వారినుండి కదిలినది శబ్దతరంగమే కదా! అని సరిపెట్టుకో.

96 నీలోని చెడును, ఇతరులలోని మంచిని గాలించి గ్రహించే సదలవాటును

కలిగియుండు. నీకు చెడు చేసిన వారిని ప్రేమించు చేసిన మంచిని గూర్చిమాట్లాడకు.

97 భగవంతుని విషయంలో నీవు సుముఖతను చూపవచ్చు.విముఖతను 

చూపవచ్చు.కానీ భగవానుడు మాత్రము నిన్ను ఎన్నడూ వదలి పెట్టడు.

ఈ సత్యమును గ్రహించి మనస్సును సదా భగవంతుని యందే విలిపెడి

అలవాటును చేసుకో.

98 అన్వేషిస్తే సత్యము అవగత మవుతుంది. విచారిస్తే సత్యము

చేరువవుతుంది. అభ్యసిస్తే సత్యము అనుభవముగా మారుతుంది. ధ్యానిస్తే

అనుభూతి స్థిరమై ఉంటుంది.

99 అహంకారాన్ని త్యజించి, వైరాగ్యమును ధరించి, నిష్కాముడుగా ఆసీనుడవై, 

ఇంద్రియ ద్వారములను మూసివేసి, కళ్ళు మూసి, హృదయాన్ని తెరిచి

అవలోకించు. నిన్ను నీవు చూసుకొనేందుకు ఇదియే సూటియైన దారి.

100 పూర్ణమైన సాగరము చంద్రోదయము కాగానే పరిపూర్ణమై గోచరించు

నట్లు, భక్తుడవైన నీవు గురుదర్శనముతో సాగరము వలె నిండిపోవాలి. ప్రేమలో

పండిపోవాలి. నీకు, భగవంతునికి మధ్య గురువు వంతెనయై ఉన్నాడని మరువకు.






NAMASTHE TELANGANA & TELANGANAM NEWS PAPERS 28 APR 2024

https://archive.org/details/namasthe-telangana-28-apr-2024 https://archive.org/details/telanganam-28-apr-2024