Wednesday, November 15, 2023

మనమేమిద్దాము..?

మనమేమిద్దాము..? 60 ఏళ్ల గోస తీర్చిన పెద్దసారుకి మనమేమిద్దాము...? సావు అంచులకెల్లి తెలంగాణ తెచ్చిన గా బక్కపానానికి మనమేమిద్దాము..? మనింట్ల బిడ్డ పుడితే ఆరోగ్యకిట్ ఇచ్చిన మంచి మనుసుకి మనమేమిద్దాము..? ఎవ్వరింట్ల పెండ్లైన తానే ఇంటి పెద్దయిన గా పెద్దమనిషికి మనమేమిద్దాము..? అవ్వఅయ్యలకు కష్టం దూరం చేసి నెల నెలకు పైసలిచ్చిన పెద్దకొడుకుకి మనమేమిద్దాము..? పుట్టింటి మేనమామకు మనమేమిద్దాము..? మన ఊరి పెద్దన్న కు మనమేమిద్దాము..? మన బతుకుల్ని ఇంత సక్కగా చేసిన పెద్ద బాపుకు మనమేమిద్దాము..? గిదంత యెందుకు గానీ గిన్ని ఇచ్చిన మన KCR సారుకీ మనమేమిద్దాము..? కారు గుర్తుకు ఓటేద్దాము మన పార్టీకి హ్యాట్రిక్ ఇద్దాం, మన బాపును మళ్ళీ ముఖ్యమంత్రి నీ చేద్దాం మన బతుకులకు మనమే భరోసాను ఇచ్చుకుందాం LAXMAN MURARI Bhandook Movie Director- 9011966666

Tuesday, November 14, 2023

జీవిత సత్యమై!

జీవిత సత్యమై! తన జీవిత కాలంలో నిత్యం అనేక ఆలోచనలతో సత్యాన్వేషణకై పోరాటం చేస్తూనే ఉంటాడు...! జీవిత సత్యమై నిరంతరం హృదయాంతరాళంలోని సంఘర్షణలతో బతుకు పాఠమౌతాడు...! అనేక ప్రశ్నలను సంధిస్తూ మనిషి పుట్టుకకు అర్ధాన్ని వివరిస్తాడు...! మానవ విలువలను తెలుసుకొని సమాజ హితం కోసం జీవించాలని గొప్ప కార్యాలను చేయాలని జన్మ రహస్యాన్ని జీవిత సత్యమై అనేక సందర్భాల్లో అందరికీ అర్థమయ్యే యాసలో, బాసలో వివరిస్తూనే ఉంటాడు...! అతను గాయమై నిప్పులా రగులుతూనే ఉంటాడు...! కాలం మారుతూ అనుభవాలై అంతరంగ భావాలతో తరంగమై సమాజపు నడకలపై పెదవి విప్పుతూ అతని మాట తూటాయై కొన్ని హృదయాలను గెలుచుకుని ప్రయాణం చేస్తున్న గొప్ప బాటసారి అతను...!!! - Kallem Naveen Reddy - Kamareddy

Monday, November 6, 2023

మేలెన్నిక

మేలెన్నిక అమ్మ లాంటి నమ్మకం నీ ముందు నడుస్తున్నది నాయినసొంటి ధైర్యం నీ వెన్నంటి వస్తున్నది గూట్లె దీపం నోట్లె బుక్క ఎద్దెం మద్దెం గాని దినాలే నీ పక్కల వున్నయి నీ బురద కాళ్ళను కడిగే గంగ నీ నెత్తిమీదే వున్నది ఎక్కేందుకు, ఎగబాకేందుకు, ఎదిగేందుకు కాళ్ళకాడ నిచ్చెన వేసే వున్నది ఆరిపోని కొత్త బంగారి వెల్గుల ఖాన్దాన్ ప్రతీకలు నీ శ్వాసకు గర్వ పరిమళం అందించేటట్టే వున్నయి మనసున్నవాడా! ప్రజాక్షేత్ర పాలకుడు నీ కడపలో కాలు పెట్టిండు పత్రమో, పుష్పమో సమర్పించి అంతరంగపు ఆలింగనమియ్యి! - విశ్వావసు

NAMATHE TELANGANA NEWS CLIPS 07NOV2023

Sunday, November 5, 2023

అంబేద్కర్ సాక్షిగా....!

అంబేద్కర్ సాక్షిగా....! అవును అంబేద్కర్ సాక్షిగా రాజ్యాంగాన్ని గౌరవించే గొప్ప నాయకుడు దేశంలో కేసిఆర్ కంటే ఎవరుంటారు! ఈ కట్టడం అనేక ప్రశ్నలకు అనేక సమాధానాలుగా నిలుస్తుంది భాగ్యనగరం నడి ఒడ్డున జ్ఞాన మార్గాలను చూపడానికి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం దేశానికే కాదు ప్రపంచానికే గొప్ప సందేశం! అతను అర్దం కావాలంటే అతనిలాగే ఆలోచించాల్సి ఉంటుంది అతనొక ప్రపంచ పుస్తకం! మతపు చీకటి కోరల్లో చిక్కుకున్న ఈ అఖండ భారత దేశాన్ని విడిపించుకోవడానికి వెలుగనే జ్ఞానాన్నీ ప్రసాదించడానికి యావత్ ప్రజలందరినీ ఏకం చేయాల్సిన మహోన్నత కార్యానికి పూనుకుని కంకణ బద్దులై కేసిఆర్ గారు సంఘ విద్రోహ శత్రువులపై అంబేడ్కర్ లాంటి ఆశయాలతో ఒక గొప్ప యుద్దాన్నే చేస్తున్నారు! ఆ గొప్ప మహా యుద్ధంలో నీకు నాకు పాల్గొనే అవకాశం వచ్చింది అంబేడ్కర్ కలలు కన్న సమాజం అతని ద్వారే నిర్మితం అవుతుంది! అతని లక్ష్యాలు అతనివి మాత్రమే కావు అతనితో పాటు దేశంపై భాధ్యత కలిగిన అందరివి! జై భారత్ తెలంగాణ కళ్లెం నవీన్ రెడ్డి కామారెడ్డి

మై విలేజ్ షో టీం తో రామన్న మాట ముచ్చట.....!

మై విలేజ్ షో టీం తో రామన్న మాట ముచ్చట.....! అందరూ ఓట్ల కోసం ఆగం ఆగం అవుతుంటే ఇంత ప్రశాంతంగా పొలాల పొంటి తిరుగుతూ బువ్వ కూర అడ్డుకుంటూ జరిగిన అభివృద్ది గురించి మాట్లాడుతూ గంగవ్వతో మాట్లాడిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో రైతు ప్రభుత్వం అనే సందేశాన్ని రైతు బతుకు రాజును చేసిన పచ్చని పొలాల్లో KTR అన్న కనిపించడం అద్భుతమైన సందేశాన్ని అందించారు! ఇంత ప్రశాంతంగా పొలాల మధ్య కనిపిస్తే వచ్చే హాట్రిక్ ప్రభుత్వం పైన ఎంత క్లారిటీ ఉందో అర్దం అవుతుంది! ఇది ఎన్నికల సమయం కాబట్టి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ మనం మాట్లాడతాము! ఏదేమైనా KTR అన్న ఇలా కనపడటం మాత్రం ఇప్పటివరకు మొత్తం సీట్లు కేటాయించనీ ప్రతిపక్షాలకు మాత్రం టెన్షన్....!!! - Kallem Naveen Reddy - Kamareddy

మేడిగడ్డ రిపోర్ట్‌పై రెచ్చిపోయిన V.Prakash -Sensational Interview -Journalist Shankar -News Line

Friday, November 3, 2023

Varthalu Vastavalu : BJP & Congress Discrimination Against Kaleshwaram,Medigadda Project | T News || 04NOV2023

యేమిటో నీ లీలలు నారాయణా

https://youtube.com/shorts/mQDqlwamryM?si=OtBdFuEAHneSHWQy

యేమిటో నీ లీలలు నారాయణా 
ఎవరూ తెలియని లోకంలోకి చేరుస్తావు. 
ఎవరెవరితోనో బంధాలు కలిసేలా చేస్తావు. 
మీవాళ్లు అంటూ కొందరని చూపిస్తావు. 
నా వాళ్లు కావాలి అనేలా ఇంకొందరిని పరిచయం చేస్తావు. 
చివరికి ఎవరితోనో ముడి వేస్తావు. ముడి వేసిన బంధాలు 
చాలవన్నట్లు మనవి కాని బంధాల మీద మక్కువ పెంచుకునేలా చేస్తావు. 
చివరికి ఎవ్వరికీ ఎవరూ కాదు నీకు నీవే తోడు. అనేలా ఒంటరిగా మిగులుస్తావు 
ఎంత చిత్రం అయ్యా.... నీ లీలలు గోవిందా

మల్లెకన్నా తెల్లనైనా మనసు నాకుందిరా#swami_sundara_chaitanyananda

కిసాన్ సర్కార్...!!#Kallem_Naveen_Reddy

 

కిసాన్ సర్కార్...!! 
కిసాన్ సర్కార్ గా రైతు ముఖ్యమంత్రిగా రైతు రుణమాఫీ! 
అతని నిర్ణయాలు ఏవైనా గొప్పగానే ఉంటాయి రైతు 
సంక్షేమం కోసం ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తాడు 
కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కేవలం పదవి 
ఉంటేనే సాధ్యం కాదు దానికి గొప్ప మనస్సు ఉండాలి! 
అలాంటి గొప్ప హృదయం కలిగిన భాద్యత నెరిగిన 
 మన తరంలో ఉన్నటువంటి గొప్ప సేవకుడు కేసిఆర్! 
అతను చెప్పిందే చేస్తాడు చేసేదే చెప్తాడు అతను 
నిరంతరం పనిచేస్తూనే ఉంటాడు అతని ఆలోచనలు 
నిత్యం ప్రయాణిస్తూనే ఉంటాయి! కళ్ళెం నవీన్ రెడ్డి

Thursday, November 2, 2023

తెలివి తప్పి మసలితే.. తెర్లవుతవు! #డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ 92465 41699

 
తెలివి తప్పి మసలితే.. తెర్లవుతవు! 
అభివృద్ధికి పట్టం, ‘బీఆర్ఎస్’ చుట్టం! ప్రగతి పరి శ్రమలకు ప్రయోజనపు గొట్టం! అడ్డగించు ప్రతిపక్షం అవును నేలమట్టం! ఎటు చూసిన 'ఫ్లయి ఓవర్ ఎదురయ్యే కట్టడాలు 'ట్రాఫిక్ సమస్యలకు’ ఆయె అడ్డు కట్టడాలు! దళితబంధు, రైతుబంధు మిళితమైన స్నేహబంధు, కాళేశ్వర ప్రాజెక్టుల కలల సాగు మనముందు! ఇంతవరకు ఏ పార్టీ అంత ఘనత చూపిందా? కళ్లు తెరచి ఒళ్లు విరిచి ఆలోచించుము ముందు! నోటుకాశ పడ్డావో ఓటరన్న ఒక్కసారి నీ కన్నును నీవే పొడుచుకొందువన్నా! తెలివి తప్పి మసలావో తెర్లవుతవు అన్నన్నో!... డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ 92465 41699

ఆయన ఆలోచనలు అజరామరం!#Kallem_Naveen_Reddy

 
ఆయన ఆలోచనలు అజరామరం! 
 మీరు గెలవడానికి ఆలోచిస్తున్నారు కానీ ఆయన గెలిపించడానికి ఆలోచిస్తాడు! తేడా అర్దం అయితేనే ఆయన అర్దం అవుతాడు! ఆయన లక్ష్యం వ్యక్తి కాదు ఆయన లక్ష్యం వ్యవస్థను అవస్థల నుండి కాపాడటమే...!! ఆయన అర్దం కావాలంటే ఆయనలాగే ఆలోచించాలి...!! అతను నిరంతరం ప్రవహించే ఆలోచనల సముద్రం...!! లోతుగా అధ్యయనం చేస్తేనే గొప్ప ఆలోచనలు అర్దం అవుతాయి గొప్ప వ్యక్తులు అర్దం అవుతారు...!! మంచి చేశాడు - మళ్ళీ వస్తాడు మన ప్రభుత్వం - మన తెలంగాణ - Kallem Naveen Reddy

యాదగిరి నరసింహ సామీ మమ్ము ఆదుకో సర్వాంతర్యామీ గానం : డి. సుబ్బారాయుడు

లలిత గీతాలు #melodies#popular_songs

అతను ఈ మట్టి పరిమళం#Kallem_Naveen_Reddy

 

అతను ఈ మట్టి పరిమళం! 
వర్షపు చుక్కలకు తడిసిన పల్లెలు తన ఒడిలో ఎన్నో పరిమళాలను కప్పి పెట్టి 
ఒక్కసారిగా ఆ పరిమళాలను కుమ్మరిస్తుంది...! అవును అందంగా పల్లెలు తడుస్తాయి 
నేలా తడుస్తుంది పచ్చదనమై పరుచుకుంటుంది మట్టి బువ్వ అవుతుంది రైతు కళ్ళల్లో ఆనందం పూస్తుంది బతుకు పాఠం అవుతుంది...! ఆ అందమైన ప్రకృతిలో ఎన్నో 
అనంతమైన అంశాలు దాగి ఉన్నాయి ఆ యోధుని ప్రేమకు తెలంగాణ మీదున్న 
బాధ్యతతో ఈ మట్టి సంతకమై భూమి పొరల్లో నుండి విచ్చుకుంటున్న మొక్కే 

Baro_Krishnayya#ragamalika#dattatreya

అతను ఈ మట్టి పరిమళం!

అతను ఈ మట్టి పరిమళం! వర్షపు చుక్కలకు తడిసిన పల్లెలు తన ఒడిలో ఎన్నో పరిమళాలను కప్పి పెట్టి ఒక్కసారిగా ఆ పరిమళాలను కుమ్మరిస్తుంది...! అవును అందంగా పల్లెలు తడుస్తాయి నేలా తడుస్తుంది పచ్చదనమై పరుచుకుంటుంది మట్టి బువ్వ అవుతుంది రైతు కళ్ళల్లో ఆనందం పూస్తుంది బతుకు పాఠం అవుతుంది...! ఆ అందమైన ప్రకృతిలో ఎన్నో అనంతమైన అంశాలు దాగి ఉన్నాయి ఆ యోధుని ప్రేమకు తెలంగాణ మీదున్న బాధ్యతతో ఈ మట్టి సంతకమై భూమి పొరల్లో నుండి విచ్చుకుంటున్న మొక్కే అతని పాలనకు నిదర్శనం...!! - Kallem Naveen Reddy

Wednesday, November 1, 2023

Krishnam_Vande#RISHI_NITYA_PRAGYA#krishna_kanhaiya #fusion#melody#bhajansong

ఎవరిదో ఆ తీయని పిలుపు ప్రేమకే కనుచూపు క్షణమైనా మరపురాని మధురమైన తలపు#swami_sundara_chaitanyananda

ఎవరిదో ఆ తీయని పిలుపు ప్రేమకే కనుచూపు క్షణమైనా మరపురాని మధురమైన తలపు#swami_sundara_chaitanyananda

ఎవరు అడగకముందే కేసిఆర్ గారు ఇప్పటిదాకా చేశాడు#Kallem_Naveen_Reddy

ఎవరు అడగకముందే కేసిఆర్ గారు ఇప్పటిదాకా చేశాడు 
 అవును ఎవరు అడగలేదు అడగాల్సిన అవసరం రాకుండా చేశాడు ఇంకా ఎన్నో చేస్తూనే ఉంటాడు ఇప్పటిదాకా ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను గమనిస్తే తెలుస్తుంది చేసిన అభివృద్ధిని చూస్తే కనిపిస్తుంది! అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదనీ అంటారు కానీ అడగముందే అన్నీ చేసిన వ్యక్తి మనతరంలో ఉండటం ఖచ్చితంగా మన అదృష్టమే! అతను ఒక చరిత్రను సృష్టించే ఆయుధం మన బతుకులను మార్చినా భరోసా అతను నిరంతరం ప్రవహించే నది అతను ఆలోచనల పరంపర! అతను శత్రువును కూడా తన పనితో ప్రభావితం చేయగలడు కాబట్టీ అతనితో నడవడం అంటే భవిష్యత్ తరాలకు మార్గాలను వేయడమే! - Kallem Naveen Reddy - Kamareddy

చైతన్య_భజనలు_15#swami_sundara_chaitanyananda and యెంత కాలమిక యెన్నాళ్ళీ కినుక నీగుడి ముంగిట ఈపడిగాపులు

అభినవ ఘంటసాల బిరుదు గ్రహీత#బాలకామేశ్వరరావు_తాట# NATS_USA#27thMAY2023

జీవితమింతేనా సుఖదుఃఖాల సమరాంగణమేనా#swami_sundara_chaitanyananda and గురుమాతృపితాగురుబంధుసఖా

ఎవరు అడగకముందే కేసిఆర్ గారు ఇప్పటిదాకా చేశాడు#Kallem_Naveen_Reddy

ఎవరు అడగకముందే కేసిఆర్ గారు ఇప్పటిదాకా చేశాడు 
అవును ఎవరు అడగలేదు అడగాల్సిన అవసరం రాకుండా చేశాడు ఇంకా ఎన్నో చేస్తూనే ఉంటాడు ఇప్పటిదాకా ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను గమనిస్తే తెలుస్తుంది చేసిన అభివృద్ధిని చూస్తే కనిపిస్తుంది! అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదనీ అంటారు కానీ అడగముందే అన్నీ చేసిన వ్యక్తి మనతరంలో ఉండటం ఖచ్చితంగా మన అదృష్టమే! అతను ఒక చరిత్రను సృష్టించే ఆయుధం మన బతుకులను మార్చినా భరోసా అతను నిరంతరం ప్రవహించే నది అతను ఆలోచనల పరంపర! అతను శత్రువును కూడా తన పనితో ప్రభావితం చేయగలడు కాబట్టీ అతనితో నడవడం అంటే భవిష్యత్ తరాలకు మార్గాలను వేయడమే! - Kallem Naveen Reddy

NAMASTHE TELANGANA & TELANGANAM NEWS PAPERS 28 APR 2024

https://archive.org/details/namasthe-telangana-28-apr-2024 https://archive.org/details/telanganam-28-apr-2024