Thursday, May 4, 2023
1. మరపు రాదు నీ దయ ఓ దయామయా and 2. కనిపించనిదైవం కనికరించినదేమో లేకున్న ఈదాహం ఎటునీకుకలుగు#Bhaktisongs#swami_sundara_chaitanyananda
మరపు రాదు నీ దయ ఓ దయామయా
కలయైనా నిజమైనా కలవరమైనా
వేదము నీవే నాదము నీవే వేదాతీత జ్ఞానము నీవే
పుణ్యము పండగ నీ దరి చేరితి కరుణించగా నీవు ధన్యుడనైతి
నా అన్న వారు నా కెవ్వరు లేరు ఉన్నది నీవే నా కున్నది నీవే
గుప్పెటి గుండెలో యెలా ఒదిగి నావో కరుణను కురిపించి కడతేర్చినావు
నారు పోసావు నీరు పెట్టావు కంటికి రెప్పలా కాచుకున్నావు
తేజము తిమిరము అంతర మెరుగక నీకై నిరతము పరితపించాను
కలల మూటలన్నీ ఆరిపోయాయి ఆశల దీపాలు ఆరిపోయాయి
కనికరించు స్వామీ కదలిపోయే వేళ కలసిపోతాను నీలో కలవరమేలేక …album 14-8
G 14-8
*************
కనిపించనిదైవం కనికరించినదేమో లేకున్న ఈదాహం ఎటునీకుకలుగు
ఏనాటి పుణ్యమో ఏవేల్పు వరమో చేరిందిసుకృతము చేజార్చుకోకు
అంతాతెలుసన్న అజ్ఞానము కన్న ఏమీతెలియదని జ్ఞానమేమిన్న
దొరికిందిదిగమింగే మత్తేభముకన్న మకరందముతీర్చే మధుపమేమిన్న
విన్నదిబాగుంది వింతవింతగావుంది విన్నదిచేసుకోవాలితనది
శిలలుకరుగును అలలరాపిడికి మనసులుపెరగాలి వినినరాబడికి
నేలకుతెలుసు నింగికితెలుసు గోవుకుతెలుసు గోపాలునిమనసు
మనసున్నమనిషివి తెలియదానీకు తెలియకున్ననేమి తెలుసుకుంటెచాలు
పెంచుకుంటెబలిమి పంచుకుంటెకలిమి ఏకమైతెచెలిమి ఏదేమైనా
గురువులమాటలు శిష్యులచేష్టలు కలసినడిచితే కైవల్యాలు
G 14-6
Subscribe to:
Post Comments (Atom)
-
51 భగవద్దర్శనము లభించలేదని వ్యధ చెందకు. సర్వులలో పరమాత్మను సందర్శిస్తూ, సేవించడము అలవరచుకో. తీరిక సమయాల్లో ధ్యానమును సాగిస్తూ, హృదయపు లోతులల...
No comments:
Post a Comment