Tuesday, May 30, 2023
ఎందుకునీ దయరాదు క్రిష్ణా పూజలెన్నోచేసి దారులెన్నోకాచి వేచిచూచినకనులుకాయలుకాచే క్రిష్ణా
ఎందుకునీ దయరాదు క్రిష్ణా
పూజలెన్నోచేసి దారులెన్నోకాచి
వేచిచూచినకనులుకాయలుకాచే క్రిష్ణా
పంకమున పుట్టిన పద్మముతగదని
హృదయ కొలనులో వూహించితినినుగని
ప్రేమజలములో పెరిగినభక్తి
సుమము సమర్పించితిని క్రిష్ణా ...
కఠినమైన కొమ్మకు కాచిన ఫలము
పూజకు కాదని మానుకొంటి
నీవేకర్తగసాగిన నాకర్మ
ఫలమేమేలనుకొంటి క్రిష్ణా
వేద్యుడవు ఆరాధ్యుడవైనా నైవేద్యము
ఏదో తెలియక నీమెళకువలో
మెలిగినమనమును
విందుగముందుంచితిని క్రిష్ణా
కప్పురము వెలిగించి
కాంతినితీసిన సాగే కాంతి
సరిగాదనియెంచి
రాగరసములో తడిసినభక్తి
వత్తిని వెలిగించితిని
Subscribe to:
Post Comments (Atom)
-
Rathi Bommalona Koluvaina Shivuda Song by Telangana Folk Singer Sai Chand రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా ... రక్త బంధం విలువ నీకు తెలియదుర...
-
51 భగవద్దర్శనము లభించలేదని వ్యధ చెందకు. సర్వులలో పరమాత్మను సందర్శిస్తూ, సేవించడము అలవరచుకో. తీరిక సమయాల్లో ధ్యానమును సాగిస్తూ, హృదయపు లోతులల...
No comments:
Post a Comment