Wednesday, July 19, 2023

మూడు గంటల కీడు మాటలు - పంజుగుల శ్రీ శైల్ రెడ్డి 90309 97371

'ఆ బైల్... ముఝ మార్' అని హిందీలో ఒక నానుడి. అంటే, సమస్యలకు ఎదురేగడం! కాంగ్రెస్ పార్టీ ఇందులో అందెవేసిన 'చెయ్యి'. ఆ పార్టీ చేసుకున్న కొత్త పాపపు పేరు అనుముల రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ యూఎస్ విభాగమైన 'తానా' సదస్సులకు పోయిన రేవంత్... ఆంధ్రా నాయ కులు, చంద్రబాబు, ఆర్కే తదితరుల మనసులో మాట చెప్తూ తెలంగాణపై విషం కక్కిండు. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ పాలనను విమర్శిస్తే కొంచెం అర్థం చేసుకోవచ్చు. అవి రాజకీయ విమర్శలు అనుకోవచ్చు. కానీ ఆయన వాంతి చేసుకున్న అక్కసు తెలంగాణపై. రేవంత్రెడ్డికి విలువ ఇవ్వనవసరం లేదని హితులు అంటూ వుంటరు కానీ నిలువెల్లా తెలంగాణ ద్వేషం నింపుకున్నవాడు వలసవాది కన్నా ప్రమాదం కదా! ఆర్కేకు రేవంత్ 'యదార్థవాది'గా కనిపిస్తు ఆన్నాడు అంటేనే రేవంత్ తెలంగాణ వ్యతిరేకి అని అర్థం. ఆర్కే ఫిలాసఫీయే యాంటీ తెలంగాణ కాబట్టి, తానా సభల్లో తన, చంద్రబాబు తాత్వికతకు తందానా అన్నడు కాబట్టే రేవంత్ ఆర్కేకు ప్రీతిపాత్రుడు. 'కాసుకు లోనై అల్లుని తలచుకు ఆనందించెను అయ్యొకడే... గురజాడ 'ముత్యాల సరాలు'లో ఉంటుంది ఈ పాదం. రేవంత్రెడ్డిని చూసి గర్వపడుతున్న ఆర్కే గురుతొచ్చిండు! 'నోరు మూసుకుంటే ఏమీ తెలియదను కుంటారు. నోరు తెరిస్తే ఏమీ తెలియదని తెలిసిపోతుంది' అన్నట్టుంది. రేవంత్ చేస్తున్న కవర్ అప్. అమెరికాలో తను మాట్లాడిన 'మూడు గంటల' మాటలకు వివరణ ఇస్తూ మరిన్ని తప్పిదాలు చేసిండు రేవంత్. బషీర్బాగ్ కాల్పులకు కారణం కేసీఆర్. అసలు రాజశేఖర్రెడ్డి ఉంటే టీఆర్ఎస్ ముక్కలయ్యేది అన్నడు ఆయన. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా నాడు డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసింది కేసీఆర్. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఉమ్మడి ఏపీలో ఎవరిని అడిగినా చెప్తారు బషీరాబాగ్ కాల్పుల దోషం ఎవరిదో, 'అసలు వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు' అని రేవంత్ రెడ్డి కోరిక. ఆయనే కాదు, ఎందరిదో దింపుడు గల్లంఆశ అది. వైఎస్సార్ కాదు, ఎవరున్నా, పోయినా ఆగేది కాదు తెలంగాణ. న్యూటన్ పుట్టకపోయినా భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండేది! చంద్రబాబు, ఆర్కే లాంటివారు తప్ప కాంగ్రెస్లో కూడా ఎవరూ రేవంత్రెడ్డి మాటలు హర్షించరు. 'బొజ్జల గోపాల్రెడ్డి ఇచ్చిన డబ్బుతో కేసీఆర్ పార్టీ పెట్టిండు'. ఇది రేవంత్ సెల్ఫ్ గోల్. చంద్రబాబు సొంత జిల్లా వారైన గోపాల్రెడ్డి నిజంగా డబ్బులు ఇచ్చి ఉంటే అది ఎంత గొప్ప విషయం! మన ప్రాంతం కానివాడు తెలంగాణకు మద్దతు ఇవ్వడం సంబురపడవలసిన విషయం కదా? తెలంగాణ బిడ్డలారా? మరి తెలంగాణ గడ్డ మీద పుట్టిన రేవంత్ కన్నా, నాది తెలంగాణే అని పదే పదే వివరణ ఇవ్వాల్సిన పనులు చేసే ఆర్కే కన్నా గోపాల్రెడ్డి ఎంత గొప్పవాడు! బాబూ రేవంత్- అసలు కాంగ్రెస్ పార్టీని స్థాపించింది ఎవరో తెలుసా? నువ్వు కొత్తగా నామాలు పెట్టుకున్న పార్టీ నాయకుని తాతలో, ముత్తాతలోకాదు. కాంగ్రెస్ ను స్థాపించింది. ఆంగ్లేయుడు. ఇంతకుమించి వివరాలు చెప్పను. ఈ వ్యాసం చదివే రేవంత్ అభిమానులు ఎవరైనా ఉంటే మీరు కనుక్కొని, మీవాడికి చెప్పండి! చరిత్ర తెలియకపోవడమే కాదు, చరిత్ర హీనుడు రేవంత్. ఎంతసేపు పక్కోళ్ల భజన తప్ప తెలంగాణ మీద సోయి లేనివాడు. తెలంగాణ ఆత్మ లేని భ్రష్టుడు. ఆర్కేకు, మోదీకి ఒక పోలిక ఉన్నది. తన పత్రిక మొదటి పేజీలో రోజూ తెలంగాణ మీద విషం కక్కే. అరే.. తన పత్రికలోనే లోపలి పేజీల్లో వచ్చే తెలంగాణ ప్రతి వార్తలు చదవరనుకుంటా! ఉదాహరణకు 'తెలంగాణలో తగ్గిన పేదరికం' శీర్షిక గణాంక సహితంగా 2015 తర్వాత ఎట్లా పేదరికాన్ని తగ్గించుకుందో నిన్న వారి పేపర్ 8వ పేజీలో వేసింది. ప్రతి రోజూ ఏదో ఒక పేజీలో ఏదో ఒక ప్రగతి వార్త వస్తనే ఉన్నది. మరి ఇంకేమి కడుపు నొప్పి! రేవంత్ ద్వారా చంద్రబాబును తిరిగి ప్రతిష్టించాలనే చొంగకార్చుడు తప్ప! ఇదివరకు తెలంగాణలో జరిగే సభల్లో కేసీఆర్పై దుమ్మూ, రాళ్లూ ఎత్తిపోసేవారు మోదీ. బీఆర్ఎస్ ప్రభంజనం తర్వాత.... మధ్యప్రదేశ్లో దేశంలోని ఇతర ప్రాంతాల్లో సైతం తెలంగాణ గురించి మాట్లాడక తప్పని స్థితికి చేరుకున్నరు. అయితే, అచ్చు ఆర్కేలాగానే లోపలి పేజీల్లో తమవే అయిన కేంద్ర మంత్రిత్వశాఖలు తెలంగాణపై గుప్పించే లెక్కకు మిక్కిలి ప్రశంసలు చూడరు. ఇదేమి ఛాతి నొప్పి? సుసంపన్న తెలంగాణను ఆదానికి దోచి పెట్టే అధికార లాలస తప్ప! బీఆర్ఎస్ సభల్లో కేసీఆర్ ఏమంటున్నరు? ఒక రిని దింపి మరొకరిని కూర్చోపెట్టడం కాదు. నాయకులు గెలవటం కాదు. అభ్యుదయ భావాల రాజకీయాలే గుణాత్మక మార్పు తేగలవు. ఫ్రంట్లు, టెంట్లు కాదు. మరి.. 'కేసీఆర్ను గద్దె దింపుతం అనే యావ' తప్ప మరొక మాట మాట్లాడుతున్నరా కాంగ్రెసైనా, బీజేపీ అయినా? దింపి ఏం చేస్తరు ? పవర్ హాలిడేలు ప్రకటించే గుజరాత్ చేస్తరా తెలంగాణను? 'అన్నభాగ్య'కు బియ్యం దొరకని కర్ణాటక చేస్తరా ? ఉమ్మడి ఏపీలో అన్నపూర్ణగా పిలువబడే గోదావరి జిల్లా 'బెండమూర్లంక' పేరు విన్నవా రేవంత్ ? ఏపీ చరిత్రలోనే మొదటిసారి 'క్రాప్ హాలిడే' ప్రకటించిన గ్రామం అది కాంగ్రెస్ హయాంలో. అపుడు మీతో పాటు టీడీపీలో ఉన్న నేను, డాక్టర్ కోడెల శివప్రసాద్ నేతృత్వంలోని వ్యవసాయ అధ్యయన కమిటీ సభ్యునిగా ఆ ప్రాంతమంతా తిరిగిన. నువ్వు ఎప్పటిలాగే బ్లాక్ దందాల్లో మునిగి తేలుతున్నవు అప్పుడు! రాజకీయాలు అంటే అర్ధమే తెలియని పరాన్న జీవులు కాంగ్రెస్, బీజేపీ. పాత కాలం పోయింది. భూస్వాములు, మతాధిపతులు ఏం చెప్తే అది వినే రోజులు పోయినయి. ప్రజలు రచ్చబండల మీద, హెయిర్ కట్టింగ్ సెలూన్లలో అసలైన రాజకీయాలు మాట్లాడుతున్నరు. నాయకుల నుంచి సిసలైన రాజకీయాన్ని ఆకాంక్షిస్తున్నరు. మొన్న ఒక హెయిర్ డ్రెస్సర్తో నాకు జరిగిన సంభాషణ (ఆయన అనుమతితో) మీ కోసం... • సార్, మాకు ఒక లక్ష రూపాయల సాయం • అప్లయి చేసుకున్నరా? లాస్ట్ డేట్ అయిపొయింది. అసలు ఎలిజిబిలిటీ ఉంటదా మాకు? వృత్తిపరంగా మీరు బీసీ-ఏ క్యాటగిరీ కాబట్టి ఉంటది. కానీ మిగిలిన కండిషన్స్ ఉన్నయి. 18-55 వయస్సు; వార్షిక ఆదాయం 2 లక్ష లకు మించకూడదు. • అయితే రాదు సర్ మాకు, నా ఆదాయం ఎక్కువ. ఇంకా అప్లయి చేయనులే! • ఎంత బాధ్యత గల వారండీ మీరు. చాలా సంతోషం. రాజకీయం ఎట్లుంది సర్? • గెలుస్తున్నం మేమే! పార్టీ మంచిదా, క్యాండిడేట్ మంచోడా. మాత్రమే చూస్తరు సార్ జనాలు, డబ్బులు పెద్ద విషయం కాదు. • అయితే పక్కా గెలుస్తం! • ఊళ్ళల్ల చాలా పేరుంది కేసీఆర్కు. • ఊ! • పనులు చేసేటోడు కావాలె కానీ, దేవుళ్లు, దయ్యం తిండి పెడుతయా సర్? • నిజమే! • రేవంత్ రెడ్డి కూడా బద్నాం అయిండు కరెంటు విషయంలో. అయినా ఆయన అడ్డందొడ్డం మాట్లాడుతడు. సీఎం అయితా అనేటోడు. ఎట్లుండాలె! • రేవంత్ మరీ టూ మచ్. క్యారెక్టర్ ముఖ్యం కదా నాయకులకు? • నిజం సర్, చీప్ గా మాట్లాడితే జనం ఒప్పుకోరు.... అదీ జనాలు కోరుకుంటున్నది! ప్రపంచంలో ఏ పార్టీ పాలనలోనైనా, ఏ నాయకుని నేతృత్వంలోనైనా, ఎంత ప్రగతి సాధించినా.. ప్రజల్లో ఎంతో తృప్తి ఉంటుంది. వారిని తప్పు పట్టలేం. వంద శాతం పనులు ఎవరూ చేయలేరు. నలుగురు సభ్యులున్న ఒక కుటుంబ పెద్ద కూడా అందరినీ ఒకేలా సంతోష పెట్టలేరు. అయితే... ఏయే అంశాల గురించి ప్రజలు రోడ్డుకెక్కిను అనేది చూస్తే తెలిసిపోతుంది అసంతృప్త స్థాయులు, వాటిని ప్రేరేపించే అంశాలు! కాంగ్రెస్ హయాంలో టీడీపీ కరెంటు కోసం ధర్నాలు చేసింది. టీడీపీ హయాంలో నీళ్ల కోసం బిందెల ప్రదర్శన చేసిండు కాంగ్రెస్ నాయకుడు పీజేఆర్. ఆ తర్వాత కరెంటు కోసం ఉద్యమించే వారిపై చంద్రబాబు కాల్పులు జరిపిండు. 'మహా మేత' వైఎస్సార్ కూడా రైతులపై కాల్పులు జరిపిండు. నీళ్లు, కరెంటు విషయంలో తొమ్మిదేండ్లలో తెలంగాణలో ఒక్క ధర్నా జరిగిందా ? ప్రజల్లో ఒక్కరైనా రోడ్లపైకి ఒచ్చిన్రా? రేవంత్ లాంటి వారి వాచాలత, వారి చిత్తశుద్ధి లేమి, వ్యక్తి కేంద్రక రాజకీయాలు, సర్వభ్రష్టత్వం, తెలంగా ణపై కక్కుతున్న విషం వీటన్నిటికీ నిరసనగా ఇపుడు ప్రజలు ఒస్తరు రోడ్లపైకి. ప్రతి రైతువేదిక వద్ద వెయ్యిమందితో సమావేశాలు జరుగుతున్నయి. 'మూడు పంటలా? మూడు గంటలా? మూడు మంటలా? అనే రణన్నినాదం కాంగ్రెస్, బీజేపీల పుట్టి ముంచబోతున్నది! ప్రపంచాన్ని ఆహారకొరత ముంచెత్తుతున్న వేళ.. ఇబ్బడిముబ్బడి పంటలతో అందరికీ అన్నం పెట్టగలిగే మన సమర్థతకు నీరాజనాలు అందే వేళ, ఎగుమతుల ద్వారా విదేశీ మారకం సమకూరేవేళ.. ఈ విపరీతాలు ఏంటో కాంగ్రెస్ ఆలోచించుకోవాలి. 'కాంగ్రెస్కు ఓటు ఉచిత విద్యుత్ కు చేటు” అని ఊళ్లల్లో కనిపిస్తున్న ప్లకార్డులు మీ రాజకీయసమాధులపై శిలాఫలకాలు అవబోతున్నయి, జాగ్రత్త సుమీ! అభివృద్ధిపై నిరాసక్తత, సం క్షేమపథకాలపై ఏడుపులతో కార్పొరేట్ల కోసమే పనిచేసే మోదీ కూడా డేంజర్ జోన్లో పడ్డరు. కాంగ్రెస్ 26 పార్టీల మద్దతు కోరుతూ ఉంటే, ఏకవీరుడినని నిన్నటిదాకా పోజు కొట్టిన మోదీ ఇప్పు డు 88 పార్టీలను దేబిరిస్తున్నడు కాంగ్రెస్ కంటే పన్నెండు దురదగొండి ఆకులు ఎక్కువ పూసుకున్నవాడై! ఎందుకయ్యా ఈ భ్రష్ట రాజకీయాలు? చుక్కలను కోసియ్యమని అడుగుతున్నరా ప్రజలు ? లేక దిక్కులను కలిపేయమంటున్నరా? విద్య, వైద్యం, ఉపాధి, ఆత్మగౌరవం ఇవే కదా వారి ఆకాంక్షలు ? ఏమి మాయరోగం మీకు.. ఏడున్నర దశాబ్దాల పాలన సరిపోలేదా ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి? తొమ్మిదేండ్లలో తెలంగాణ చేసి చూపిస్తే మాత్రం కడుపు నొస్తదా? కారుకూతలు కూస్తరా? ‘దునియామే రహనాహై తో కామ్ కర్ ప్యారే -ఆనంద్ బక్షీ రాసిన హిందీ సినీగీతం లైన్ ఇది. అట్లా... రాజకీయాల్లో ఉండాలంటే శ్రమ చేయాలి. నిజాయితీ ఉండాలి. వివేకం ఉండాలి. ఏకాగ్రత కావాలి. అన్నిటికీ మించి సమాజం పట్ల ప్రేమ, బాధ్యత ఉండాలి. తెలంగాణలో ఇవన్నీ ఉన్నవి ఒక్క కేసీఆర్కే జనం నాడి తెలిసిన మా హెయిర్ డ్రెసర్ సాక్షిగా! కూట (మి) నీతుల తాట తీస్తం! ఖబడ్డార్!!

No comments:

Post a Comment