Revanth Reddy | టీపీసీసీని టీటీడీపీగా మార్చేస్తున్న రేవంత్ రెడ్డి!.. ఏపీలో చంద్రబాబు గెలుపు కోసమే తండ్లాట!
Revanth Reddy | స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, జూలై 13, (నమస్తే తెలంగాణ): ‘పోలవరం కట్టేది మనమే.. అమరావతి నిర్మించేది మనమే’.. ఇవీ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అమెరికాలో జరిగిన తానా సభలో మాట్లాడిన మాటలు. మరి ఈ మనం అంటే ఎవరు? ఏపీలో ఓ వర్గమా? లేక ఓ కులమా? లేక ఓ పార్టీనా? అక్కడ కాంగ్రెస్ లేదు.. పుం జుకొనే అవకాశమూ కనిపించడం లేదు. అధికార వైసీపీకి రేవంత్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. ఇక ప్రతిపక్షంలో ఉన్నదల్లా టీడీపీనే. ఆ పచ్చ పార్టీనే రేవంత్‌రెడ్డి మనం అని సంబోధించారని కాస్తోకూస్తో రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారికి అర్థమైపోతుంది. ఏపీ లో చంద్రబాబు గెలుపుకోసం రే వంత్‌రెడ్డి తహతహలాడుతున్నట్టు ఆయన వ్యాఖ్యలే చెప్తున్నాయి. ఓ పడవ (కాంగ్రెస్) లో ప్రయాణిస్తూ మరో పడవ (టీడీపీ)ను ఒడ్డుకు చేర్చాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు కోసం రేవంత్ ఆరాటపడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మండిపడుతున్నారు.టీడీపే తన పార్టీ అనుకుంటున్నాడా?రేవంత్‌రెడ్డి 2017లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీని వదిలి ఐదేండ్లు గడుస్తున్నది. కానీ రేవంత్‌రెడ్డి తాను ఇప్పటికీ టీడీపీలో ఉన్నట్టుగా భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో టీడీపీని బలోపేతం చేయడానికే శక్తివంచన లేకుండా కష్టపడుతూనే ఉన్నారు. టీపీసీసీని టీటీడీపీగా మార్చడానికే రేవంత్‌రెడ్డి కంకణం కట్టుకొన్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు గతంలో చాలాసార్లు వాపోయారు. తాజాగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వద్దని, మూడు గంటలు మస్త్ అని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు కూడా మాజీ బాస్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆలోచనల నుంచి పుట్టినవే అయి ఉంటాయనే విమర్శలు వెల్లువెత్తాయి.
టీడీపీ సెల్‌గా టీపీసీసీ ఎన్నారై సెల్!
కాంగ్రెస్‌లో మండల కమిటీల ఏర్పాటుపై గాంధీభవన్‌లో ఓ వైపు మూడు నిరసనలు, ఆరు ధర్నాలుగా గొడవలు జరుగుతుంటే.. తాజాగా ఆ లొల్లి అమెరికాకు కూడా పాకింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అమెరికా వెళ్లిన సందర్భంగా ఆయన అక్కడ 70 మందితో కూడిన కాంగ్రెస్ ఎన్నారై సెల్‌ను ప్రకటించారు. ఇందులో ‘జై చంద్రబాబు, జై బాలయ్య’ అన్నోళ్లకే స్థానం లభించిందని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరులుగా ఉన్నవారు వాపోతున్నారు. ‘టీపీసీసీ ప్రకటించిన ఎన్నారై సెల్… తెలంగాణ కాంగ్రె స్ ఎన్నారై సెల్లా కాకుండా తెలంగాణ టీడీపీ ఎన్నారై సెల్లా ఉంది’ అని వారు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. రేవంత్ తీరును సామాజిక మాధ్యమాల వేదికగా ఎండగట్టారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకే కా దు ఎన్నారైలకు కూడా రేవంత్‌రెడ్డి పచ్చ రంగేసి వచ్చారని ఇక్కడ గాంధీభవన్‌లో ఓ నాయకుడు వాపోయారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా వేసుకొని తన గురువు చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు.
No comments:
Post a Comment