Friday, November 3, 2023

యేమిటో నీ లీలలు నారాయణా

https://youtube.com/shorts/mQDqlwamryM?si=OtBdFuEAHneSHWQy

యేమిటో నీ లీలలు నారాయణా 
ఎవరూ తెలియని లోకంలోకి చేరుస్తావు. 
ఎవరెవరితోనో బంధాలు కలిసేలా చేస్తావు. 
మీవాళ్లు అంటూ కొందరని చూపిస్తావు. 
నా వాళ్లు కావాలి అనేలా ఇంకొందరిని పరిచయం చేస్తావు. 
చివరికి ఎవరితోనో ముడి వేస్తావు. ముడి వేసిన బంధాలు 
చాలవన్నట్లు మనవి కాని బంధాల మీద మక్కువ పెంచుకునేలా చేస్తావు. 
చివరికి ఎవ్వరికీ ఎవరూ కాదు నీకు నీవే తోడు. అనేలా ఒంటరిగా మిగులుస్తావు 
ఎంత చిత్రం అయ్యా.... నీ లీలలు గోవిందా

No comments:

Post a Comment

25 ఏళ్ల యాత్ర....!! Kallem Naveen Reddy

 25 ఏళ్ల యాత్ర....!! అనేక అంశాలపై దృష్టి గలవాడు అద్వితీయ విజన్‌ తో ముందుకు నడిపే నాయకుడు రాష్ట్రం అభివృద్ధే లక్ష్యంగా ఉంచి పార్టీని స్థాపించ...