Monday, February 5, 2024

ఒక సమయం వస్తుంది

 ఒక సమయం వస్తుంది

ఆ సమయంలో

ఎన్నో కష్టాలు 

చుట్టూ చేరుతాయి

ఒకదాని వెంబడి ఒకటి

ఊపిరి కూడా తీసుకోలేనంత

వెంట పడతాయి!

నీ ప్రయత్నం ముందు

నీ సంకల్ప బలం ముందు

ఎన్ని అవస్థలు ఎదురైనా

అవన్నీ ఒకరోజు

చెల్లా చెదురైతాయి!

ఉండాల్సింది కేవలం 

ఓపిక మాత్రమే!

చేసింది ఏది కూడా

వృధా కాదు

కాలం సమాధానంగా ఉంటుంది!

నాకు ఆదర్శం కేసిఆర్

కష్టపడనంత వరకు 

కలలు సాధ్యం కావు

సంఘర్షణలు ఎదుర్కోలేనంత వరకు

ఒక చరిత్ర సృష్టించబడదు!

అతని ఆలోచనలు

తరగలు తరగలుగా

నురగలు నురగలుగా

ప్రవహిస్తూనే ఉంటాయి!

అతని ఆలోచనల్లో భాగమై

పనిచేస్తూనే ఉంటాను!

- Kallem Naveen Reddy


No comments:

Post a Comment

25 ఏళ్ల యాత్ర....!! Kallem Naveen Reddy

 25 ఏళ్ల యాత్ర....!! అనేక అంశాలపై దృష్టి గలవాడు అద్వితీయ విజన్‌ తో ముందుకు నడిపే నాయకుడు రాష్ట్రం అభివృద్ధే లక్ష్యంగా ఉంచి పార్టీని స్థాపించ...