Sunday, February 4, 2024
నమస్తే తెలంగాణ 4th Feb 2024తరువే నా గురువు
తరువే నా గురువు రచన : కోట్ల వెంకటేశ్వరరెడ్డి 9440233261
ఎక్కడో ఒక చోట
నిలకడే దాని అస్తిత్వం
పనిగట్టుకొని ఎవరికీ
ఎప్పుడూ ఏ పాఠం చెప్పుదు
దాని ఆచరణ శీలతే
నేను నేర్చిన పాఠం
కొన్నికొన్ని సందర్భాలు
మనకంతగా అర్థం కావు
అది ఊగితే గాలొస్తుందా?
గాలొస్తే అది ఊగుతుందా?
నిలకడ సాధించనిది
తత్వం బోధపడదు
ఆకులు రాలుతున్నా
అది వగపు గీతాలాలపించదు.
కాసిన కాయలపై రాయి విసిరినా
కసితో ప్రతి హింసకు పూనుకోదు
రాచి రంపాన పెట్టినా
నరికి కుప్పలు వేసినా కన్నెర్ర జేయదు
ఎన్ని సార్లు ధ్వంసం చేసినా
చిగురు దరహాసమే సమాధానం
పగవాడు అలసివచ్చినా
ఆతిథ్యంలో తేడా చూపడు
పక్షి, పాము, సీతాకోకచిలుక
ఏదైనా ఒకటే భుజాల మీద ఊరేగింపే
బోధి వృక్షం కింద కూర్చుంటే
బుదొస్తుందా అంటే బుద్దుడే సాక్షి!
ఉపకారం తప్ప ఏ అపకారం చేయకపోతేనే
చెట్టంత మనిషంటారు!
రచన : కోట్ల వెంకటేశ్వరరెడ్డి 9440233261
Subscribe to:
Post Comments (Atom)
నమస్తే తెలంగాణ & TELANGANAM 24 NOV 2024
రేవంత్ రెడ్డి .. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది అది నోరైతే నిజాలు వస్తాయి-అదే మూసీ అయితే మాయమాటలే వస్తాయి పిల్ల చేష్టలు, గారడీ మా...
-
51 భగవద్దర్శనము లభించలేదని వ్యధ చెందకు. సర్వులలో పరమాత్మను సందర్శిస్తూ, సేవించడము అలవరచుకో. తీరిక సమయాల్లో ధ్యానమును సాగిస్తూ, హృదయపు లోతులల...
No comments:
Post a Comment