Sunday, November 5, 2023

అంబేద్కర్ సాక్షిగా....!

అంబేద్కర్ సాక్షిగా....! అవును అంబేద్కర్ సాక్షిగా రాజ్యాంగాన్ని గౌరవించే గొప్ప నాయకుడు దేశంలో కేసిఆర్ కంటే ఎవరుంటారు! ఈ కట్టడం అనేక ప్రశ్నలకు అనేక సమాధానాలుగా నిలుస్తుంది భాగ్యనగరం నడి ఒడ్డున జ్ఞాన మార్గాలను చూపడానికి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం దేశానికే కాదు ప్రపంచానికే గొప్ప సందేశం! అతను అర్దం కావాలంటే అతనిలాగే ఆలోచించాల్సి ఉంటుంది అతనొక ప్రపంచ పుస్తకం! మతపు చీకటి కోరల్లో చిక్కుకున్న ఈ అఖండ భారత దేశాన్ని విడిపించుకోవడానికి వెలుగనే జ్ఞానాన్నీ ప్రసాదించడానికి యావత్ ప్రజలందరినీ ఏకం చేయాల్సిన మహోన్నత కార్యానికి పూనుకుని కంకణ బద్దులై కేసిఆర్ గారు సంఘ విద్రోహ శత్రువులపై అంబేడ్కర్ లాంటి ఆశయాలతో ఒక గొప్ప యుద్దాన్నే చేస్తున్నారు! ఆ గొప్ప మహా యుద్ధంలో నీకు నాకు పాల్గొనే అవకాశం వచ్చింది అంబేడ్కర్ కలలు కన్న సమాజం అతని ద్వారే నిర్మితం అవుతుంది! అతని లక్ష్యాలు అతనివి మాత్రమే కావు అతనితో పాటు దేశంపై భాధ్యత కలిగిన అందరివి! జై భారత్ తెలంగాణ కళ్లెం నవీన్ రెడ్డి కామారెడ్డి

No comments:

Post a Comment