Monday, November 6, 2023

మేలెన్నిక

మేలెన్నిక అమ్మ లాంటి నమ్మకం నీ ముందు నడుస్తున్నది నాయినసొంటి ధైర్యం నీ వెన్నంటి వస్తున్నది గూట్లె దీపం నోట్లె బుక్క ఎద్దెం మద్దెం గాని దినాలే నీ పక్కల వున్నయి నీ బురద కాళ్ళను కడిగే గంగ నీ నెత్తిమీదే వున్నది ఎక్కేందుకు, ఎగబాకేందుకు, ఎదిగేందుకు కాళ్ళకాడ నిచ్చెన వేసే వున్నది ఆరిపోని కొత్త బంగారి వెల్గుల ఖాన్దాన్ ప్రతీకలు నీ శ్వాసకు గర్వ పరిమళం అందించేటట్టే వున్నయి మనసున్నవాడా! ప్రజాక్షేత్ర పాలకుడు నీ కడపలో కాలు పెట్టిండు పత్రమో, పుష్పమో సమర్పించి అంతరంగపు ఆలింగనమియ్యి! - విశ్వావసు

No comments:

Post a Comment

#చింతన#గీతాజయంతి_సందర్భంగా_గీతామృతస్నానం#DR_VAISHNAVANGRI_SEVAK_DAS #9821914642

  చింతన  -  గీతా  జయంతి సందర్భంగా .. గీతామృత  స్నానం ' సకృద్  గీతామృత స్నానం సంసార మలనాశనం '    అని  ' గీతా  మహాత్మ్యం '  పల...