Tuesday, November 14, 2023

జీవిత సత్యమై!

జీవిత సత్యమై! తన జీవిత కాలంలో నిత్యం అనేక ఆలోచనలతో సత్యాన్వేషణకై పోరాటం చేస్తూనే ఉంటాడు...! జీవిత సత్యమై నిరంతరం హృదయాంతరాళంలోని సంఘర్షణలతో బతుకు పాఠమౌతాడు...! అనేక ప్రశ్నలను సంధిస్తూ మనిషి పుట్టుకకు అర్ధాన్ని వివరిస్తాడు...! మానవ విలువలను తెలుసుకొని సమాజ హితం కోసం జీవించాలని గొప్ప కార్యాలను చేయాలని జన్మ రహస్యాన్ని జీవిత సత్యమై అనేక సందర్భాల్లో అందరికీ అర్థమయ్యే యాసలో, బాసలో వివరిస్తూనే ఉంటాడు...! అతను గాయమై నిప్పులా రగులుతూనే ఉంటాడు...! కాలం మారుతూ అనుభవాలై అంతరంగ భావాలతో తరంగమై సమాజపు నడకలపై పెదవి విప్పుతూ అతని మాట తూటాయై కొన్ని హృదయాలను గెలుచుకుని ప్రయాణం చేస్తున్న గొప్ప బాటసారి అతను...!!! - Kallem Naveen Reddy - Kamareddy

No comments:

Post a Comment

25 ఏళ్ల యాత్ర....!! Kallem Naveen Reddy

 25 ఏళ్ల యాత్ర....!! అనేక అంశాలపై దృష్టి గలవాడు అద్వితీయ విజన్‌ తో ముందుకు నడిపే నాయకుడు రాష్ట్రం అభివృద్ధే లక్ష్యంగా ఉంచి పార్టీని స్థాపించ...