Sunday, January 14, 2024
అసలైన నాయకుడు కేటీఆర్
నమస్తే తెలంగాణ
అసలైన నాయకుడు
కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావాలంటే
ఎన్నయినా చెప్పుకోవచ్చు. కానీ, ఆయన అలా చేయలేదు.
విజయం దక్కినప్పుడు ఆ క్రెడిట్ అందరికీ చెందుతుం
దని చెప్పే ఆయన.. పార్టీకి ఎదురైన ప్రతికూల పరిస్థితికి
మాత్రం తనదే పూర్తి బాధ్యత అని ధైర్యంగా చెప్పుకొన్నారు. తద్వారా నిజమైన
నాయకుడనిపించుకున్నారు.
- పాటిమీది జగన్
ఐటీ శాఖ మంత్రిగా ఉన్న ఐప్పుడే ప్రపంచంలోనే అతి పెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ని
నిర్మించామని చెప్పుకోవచ్చు. 2014లో రూ.57 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతుల విలువని
2023లో రూ.2.41 లక్షల కోట్లకు నేనే తీసుకువచ్చాను అని కూడా చెప్పుకోవచ్చు.
టీఎస్ ఐపాస్, టీఎస్ టీ-పాస్ లాంటి విప్లవాత్మక
మైన చట్టాలను తెచ్చి దేశ, విదేశాల అని
ప్రశంసలు పొందాం అని చెప్పాచ్చు. అమెజాన్ లాంటి బహుళజాతి సంస్థ అతిపెద్ద
డేటా సెంటరు హైదరాబాద్కు నేనే రప్పించానని చెప్పుకోవచ్చు. నా హయాంలోనే
గూగుల్, ఫేస్బుక్, మెడిట్రాన్, సాఫ్సోల్, కవల్ కామ్, నోవార్టీస్ లాంటి
సంస్థలు వాటి రెండో అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్ లో
ఏర్పాటు చేశాయని చెప్పుకోవచ్చు.
టీ-హబ్, టీ-వర్క్, టీ-ఇమేజ్ టవర్ ఆవిష్కరణలతో ప్రపంచంలోనే
అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ సృష్టించామని చెప్పుకోవచ్చు. నా మానస
పుత్రిక అయిన ఎస్ఆర్డీపీ కార్యక్రమం ద్వారా హైదరాబాద్లో 30 నుంచి
40 ఫ్లైఓవర్లు, అండర్పస్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, పదుల సంఖ్యలో లింక్
రోడ్లు నిర్మితమయ్యాయని చెప్పుకోవచ్చు. ఒక్కమాటలో సమస్త హైదరాబాద్
రూపురేఖలను నేనే మార్చేశానని కూడా చెప్పుకోవచ్చు.
నేను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే 60 లక్షల సభ్యత్వ
నమోదు జరిగిందని చెప్పుకోవచ్చు. 2016లో నా వల్లే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో
99 మంది కార్పొరేటర్లు గెలిచారని చెప్పుకోవచ్చు. 2018 సార్వత్రిక
ఎన్నికల విజయంలో నాదే నంబర్ 2, నంబర్ 3 పాత్ర అని చెప్పుకోవచ్చు.
సాధించిన విజయాల ప్రస్తావన ఎక్కడా లేదు. కానీ, ఇప్పుడు ఎదురైన ఓటమికి
ఎమ్మెల్యేలనో, ఇతర నాయకులనో లేదా కార్యకర్తలనో బాధ్యులని
చేయలేదు. ఈ వైఫల్యానికి పూర్తి బాధ్యత నాదే అని కేటీఆర్ అన్నారు.
గెలిచినప్పుడు ఇది సమష్టి విజయం అని అన్నారు.. ఓడినప్పుడు పూర్తి బాధ్యత
నాదే అని ఆయన అన్నారు.
గతంలో దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ క్యాడర్
సర్వశక్తులు ఒడ్డినా, ప్రత్యేక పరిస్థితుల్లో ఎదురైన ఓటమికి పూర్తి
బాధ్యత నాదేనని హరీష్ రావు కూడా ప్రకటించారు. మన
నాయకుల లాగానే ఓటమికి బాధ్యత మనం కూడా తీసుకుం
దామా? పార్టీ బలోపేతానికి, తిరిగి అధికారంలోకి రావడానికి
కృషి చేద్దామా? లేదా ఓటమికి కారణం మీరంటే మీరని ఒకరిపై
ఒకరం దుమ్మెత్తి పోసుకుందామా?
ఇప్పటికీ తెలంగాణలో అత్యంత బలమైన పార్టీ మన బీఆర్ఎస్సే అనేది
మనం గుర్తుంచుకోవాలి. ఎమ్మెల్యేల సంఖ్య మాత్రమే తగ్గింది. 65 శాతం
ఎంపీలు. 80 శాతానికిపైగా ఎమ్మెల్సీలు, 128 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో
115కి పైగా చైర్మన్లు, మేయర్లు, 32 మంది జడ్పీ చైర్మన్లలో 30కి పైగా
మనవాళ్లే ఉన్నారు. అత్యధిక స్థానాలలో కార్పొరేటర్లు, జడ్పీటీసీలు,
ఎంపీటీసీలు, అన్నిటికన్నా ముఖ్యంగా లక్షలాది మంది గులాబీ కుటుంబ
సభ్యులున్నారు.
ఈ స్థాయిలో అంకెలు సాధించాలంటే కాంగ్రెస్, బీజేపీలకు మరో 50
ఏండైనా వీలుకాదు. కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో విజయాలు సాధించాం.
అన్నిటికన్నా చిరస్మరణీయమైన విజయం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం.
సార్ నాయకత్వంలో భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధిస్తాం.
ఇది మన పార్టీ, తెలంగాణ అస్తిత్వమే మనం.
-జైతెలంగాణ.. జైకేసీఆర్
Subscribe to:
Post Comments (Atom)
నమస్తే తెలంగాణ & TELANGANAM 24 NOV 2024
రేవంత్ రెడ్డి .. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది అది నోరైతే నిజాలు వస్తాయి-అదే మూసీ అయితే మాయమాటలే వస్తాయి పిల్ల చేష్టలు, గారడీ మా...
-
51 భగవద్దర్శనము లభించలేదని వ్యధ చెందకు. సర్వులలో పరమాత్మను సందర్శిస్తూ, సేవించడము అలవరచుకో. తీరిక సమయాల్లో ధ్యానమును సాగిస్తూ, హృదయపు లోతులల...
No comments:
Post a Comment