Saturday, January 13, 2024

రాష్ట్రాన్ని బద్నాం చేసేందుకు కుట్ర

రాష్ట్రాన్ని బద్నాం చేసేందుకు కుట్ర రాష్ట్రంలోని 33 జిల్లాలను కుదించాలనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎందుకు వచ్చిందో మేధావులకు సైతం అంతుచిక్కడంలేదు. ముఖ్యమంత్రి నెల రోజుల పాలనా తీరు చూస్తుంటే.... "మాకు పాలించే తెలివి లేదు, మీరే పాలించండి. మేం బానిసల లెక్క మీ వద్ద పనిచేస్తాం. మా వనరులు, మా సంపద దోచుకుపోండి, మేం చూస్తూ ఊరుకుంటాం..' అన్నట్టు ఉన్నది. గోగుల రవీందర్ రెడ్డి 95022 52229 సాధారణంగా ఎన్నికల్లో గెలిచిన ఏ పార్టీ అయినా మొదట ప్రజలకు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పోతుంది. ఎందుకంటే ఆ హామీలను నమ్మే ప్రజలు ఏ పార్టీకైనా అధికారం ఇస్తారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కానీ, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే పనులను కాంగ్రెస్ పార్టీ ముందటేసుకుంటున్నది. రాష్ట్రంలో పరిస్థితిని చూస్తుంటే జిల్లాలను "కుదించడంలో రేవంత్ ఎత్తుగడ ఇదేనేమో అన్న అనుమానం నాకే కాదు, యావత్ రాష్ట్ర ప్రజలకు కలుగుతున్నది. లేకుంటే ఇప్పటికిప్పుడు జిల్లాలను కుదించే అవసరం దేవంత్ కు ఎందుకు వచ్చింది. అసలు ఆ అవసరం కానీ, ఆ అవకాశం కానీ లేదు. ఉన్నపళంగా జిల్లాలను కుదించే ఆలోచన వెనుక మర్మం ఏమిటోనని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. "చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు అభివృద్ధికి చిహ్నాలు' అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ఆయన ఆలోచనావిధానం ప్రకారం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా విభజించి ప్రజలకు చక్కటి సౌకర్యవంతమైన పాలన అందిస్తే. జిల్లాలను కుదించి ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన సీఎం రేవంత్రెడ్డికి ఎందుకు వచ్చిందో మరి. రాష్ట్రంలో చిన్న జిల్లాలు ఏర్పాటయ్యాక ప్రజలకు సౌకర్యంగా మారాయి. జిల్లాకో కలెక్టర్ కార్యాలయంతోపాటు అన్ని పాలనా విభాగాలు ఒక్కచోట చేరి ప్రజాసమస్యలను గంటల్లోనే పరిష్కరించారు. ప్రజలు కలెక్టరు నేరుగా కలిసి వారి సమస్యను చెప్పి, వెంటనే పరిష్కరించుకునే అవకాశం ఉంది. జిల్లాలు కుదిస్తే ఆ అవకాశం ప్రజలకు దక్కకుండా పోతుందనడంలో సందేహం లేదు. ఉన్నతాధికారులు సైతం జిల్లా అంతటా కలియదిరిగి ఎక్కడ ఏ సమస్య వచ్చినా పరిశీలించి పరిష్కరించిన సందర్భాలను గతంలో మనం చాలా చూశాం. ఇప్పుడు జిల్లాలను కుదించాలనే ఆలోచన వెనుక పెద్ద కుట్రనే దాగి ఉన్నదనేది అందరికీ అర్ధమవుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తూ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పోకడలకు పోతున్నది. దానికి తాజా ఉదాహరణే కాంగ్రెస్ పేరు మార్చి ప్రవేశపెట్టిన 'రైతు 'భరోసా' పథకం. ఆ పథకం కింద ఎకరానికి ఏటా రూ.15 వేలు ఇస్తానని ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోగా ఇప్పటికి రైతుల ఖాతాల్లో జమచేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం సిద్ధంగా పెట్టిన 'రైతుబంధు' డబ్బులను కూడా రైతుల ఖాతాల్లో జమ చేయడం లేదు. తత్ఫలితంగా రైతులు 'రైతుబంధు' మొర్రో అని మొత్తుకుంటున్నారు. ఇక ఆర్భాటంగా ప్రవేశపెట్టిన 'మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం'లో అనేక ఇబ్బందులున్నాయి. సరైన బస్సులు లేక, బస్సులున్నా అందులో సీట్లు లేక మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుండటం అమానవీయం. ఆరోగ్యశ్రీ పరిధిని కేసీఆర్ ప్రభుత్వం ఏడాది కిందనే రూ.10 లక్షలు చేసింది. దాన్ని మరిచిపోయిన కాంగ్రెస్ నాయకులు ఆరోగ్యశ్రీ పరిధిని పెంచా మంటూ డాంబికాలు ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో చేయాల్సిన అభివృద్ధి పనులు చేస్తామన్న హామీలను పక్కన పడేసి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కుట్రలు పన్నుతున్నదని ప్రజలకు స్పష్టంగా అర్ధమవుతున్నది. స్పష్టంగా చెప్పాలంటే కాంగ్రెస్ నేతలంతా కలిసి ఆడిన నాటకంలో పాపం తెలంగాణ ప్రజలు బలయ్యారు. ఇది నూటికి నూరు పాళ్లు నిజం. కేసీఆర్ పాలనా విధానాన్ని చూసి ఓర్చుకోలేని కొందరు కాంగ్రెస్ నాయకులు, కుహనా మేధావులు ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. యూట్యూబ్ చానళ్లు ఏర్పాటుచేసుకుని ప్రజల మనసుల్లో విషం నింపిండ్రు. నోటికి ఏది వస్తే ఆది మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టడంలో సఫలమ య్యారు. నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగివచ్చినట్టు ఈలోపు జరగాల్సిన నష్టం జరిగింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు దాటింది. ఈకాలంలో అనేక తప్పుడు నిర్ణయాలు జరుగుతున్నాయి. గతంలో తప్పు తప్పు అని గొంతు చించుకున్న స్వయం ప్రకటిత మేధావులు ఎవ్వరూ ఇప్పుడు నోరు విప్పడం లేదు. ప్రశ్నించే గొంతుకలని డబ్బా కొట్టుకున్న బుద్ధిజీవులు కానరాకుండా పోయారు. పచ్చబడ్డ తెలంగాణను మంటల్లో నెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయినా ఈ కుహనా మేధావులు, బుద్ధిజీవులకు చలనం రాకపోవడం శోచనీయం. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఏనాడూ నిధుల కొరత రాలేదని ప్రజలకు తెలుసు. చిరుద్యోగులను సైతం అదరించి వారికి జీతాలు అందించిన ఘనత ఆయనది. హోంగార్డులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీల వేతనాలు పెంచిన ఘనత ఆయనది. బీడీ కార్మికులకు, నేతన్నలకు, గౌడన్నలకు, వికలాంగులకు వృద్ధులకు, బోధకాలు బాధితులకు ఇలా ఎంతోమందికి పింఛన్లు ఇచ్చిఆదుకున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. 'తిండి పెట్టే రైతన్న మరణం దేశానికి అరిష్టం" అని రైతులను ఆదుకున్న చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిది. కేసీఆర్ హయాంలో రాష్ట్రం దివాళా తీసిందని బద్నాం చేస్తూ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం చేస్తూ, రైతులకు రైతుబంధు చేయకపోవడం లాంటి కాంగ్రెస్ ప్రభుత్వ వికృతచేష్టలను ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. దేశానికి రోల్ మోడల్గా ఉన్న స్థాయి తెలంగాణది. అలాంటి తెలంగాణ స్థాయిని దేశవ్యాప్తంగా దిగజార్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగడం అత్యంత హేయం. ఎవరిది మాటల ప్రభుత్వమో, ఎవరిది చేతల ప్రభుత్వమో ప్రజలకు ఇప్పటికే అర్థమైంది.

No comments:

Post a Comment